పల్లవి:👨🎤👩🎤
{జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే } [2]
స్తుతులర్పించెదము
స్తోత్రము చేసెదము } [2]
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము } [2]
జయం జయం
చరణం:1️⃣
{పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి (2)
మూడవదినమున – తిరిగి లేచెను (2)
మరణపు ముల్లును విరిచెను (2)
జయం జయం
చరణం:2️⃣
పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును (2)
సిలువను గెలిచి – తిరిగి తెచ్చెను (2)
సాతాను బలమును గెలిచెను (2)
జయం జయం
చరణం:3️⃣
పాపము విడిచి సోదరా
ప్రభు సన్నిధికి రారమ్ము (2)
పునరుత్ధాన శక్తితో నింపి (2)
పరలోకమునకు చేర్చును (2)
|జయం జయం|
🎤
0 Comments