TELUGU CHRISTIAN SONG LYRICS
యేసయ్యా నా యజమానుడవు నీవే
యజమానుడా నా యేసయ్య • Telugu Christian Worship Song
పాట సాహిత్యం
యేసయ్యా నా యజమానుడవు నీవే
యజమానుడా నా యేసయ్య
ప్రతి క్షణమున నిన్నే స్తుతియింతును
నా ప్రాణమా నా జీవమా
జీవితమంతయు నీకేనయ్య
ఎన్నెన్నో కష్టాలు ఎదురైనను నీతోనే నా జీవితం
స్థితిగతులే చే దాటిన నీతోనే నా పయనము
నా అభిలాష అంతయు నీవే బలము ధైర్యము నీవే
నాకున్న సర్వం నీవే ఆధరణకర్త నీవే
చరణం 1
శ్రమల చేత అధికముగా కృంగిపోతినయా
అనుదినము దుఃఖముతోనే నలిగి పోతినయా
స్థితి అంత చూచావు సమీపముగా వచ్చావు
నీకు నేనున్నానని నాకు అభయమిచ్చావు
రాజా ప్రభువా
చరణం 2
నా జీవితమే అంధకారమై ఒంటరినైతినయ
ఏ దారి కానరాక గమ్యమే దొరకక అల్లాడిపోతినయా
నన్ను దర్శించావు నన్ను ధైర్యాపరిచావు
నా వెంట నిలిచావు నడిపించు చున్నావు
నాధా దేవా
పాట వివరాలు
పాట పేరు: యేసయ్యా నా యజమానుడవు నీవే
భాష: తెలుగు
వర్గం: తెలుగు క్రైస్తవ ఆరాధన పాట
వీడియో: YouTube
పాట వివరాలు & Credits
Lyrics, Tune & Vocals: Pastor G. Agaman Prakash
Contact: 95532 04694
Music: Sudha [Adhvithiya Studios]
Chorus: Sister Rani, Abhinaya, Aruna & Bro. Amosu
DOP, Editing & AI: Krupa Studio KMM
YouTube Channel: @KrupaStudioKmm
ఈ పాట ద్వారా దేవుని స్తుతించి, విశ్వాసంలో బలపడండి.
0 Comments