దేవుని ప్రేమ ఇదిగో GOOD FRIDAY SONG LYRICS 🎵

దేవుని ప్రేమ ఇదిగో GOOD FRIDAY SONG LYRICS 🎵

Praise And Worship God 🙏


*🎶 దేవుని ప్రేమ ఇదిగో!🎶*

దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును (2) ||దేవుని||

1. మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను (2)
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే (2) ||దేవుని||

2. రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ (2)
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను (2) ||దేవుని||

3. నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును (2)
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను (2) ||దేవుని||

Post a Comment

0 Comments

Join In Telegram