*అంశం : నీ స్థితి మారాలంటే....?* ||| నీ బాధకు కారణం తెలియడం లేదా? || MUST READ NOW || DON'T SKIP MESSAGE ||

*అంశం : నీ స్థితి మారాలంటే....?* ||| నీ బాధకు కారణం తెలియడం లేదా? || MUST READ NOW || DON'T SKIP MESSAGE ||

*అంశం : నీ స్థితి మారాలంటే....?*

👉నీ స్థితి మారాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రార్థించినా మారదు.
👉నీ స్థితి మారాలంటే ప్రాముఖ్యమైనది దేవుని ఎదుట నీ హృదయము, నీ అంతరంగము సరియైనదిగా ఉండాలి.
 👉మనుష్యులు ఎప్పుడును పైరుపమును లక్ష్యపెట్టుదురు గాని దేవుడు మాత్రము ఎప్పుడును హృదయమును లక్ష్యపెట్టును.
👉అందుకే బైబిల్లో కొన్నిచోట్ల యేసుప్రభువు వారి హృదయ అంతరంగము ఎరిగి......... అని ప్రస్తావించబడింది.
👉దేవుడు ఒక వ్యక్తి స్థితిని మార్చాలంటే అతడు నీతిగా ప్రవర్తించాలి.
*హృదయశుద్దిని ప్రేమించువాడికి రాజు స్నేహితుడగును(సామెత 22:11)*.
👉మరి దానియేలు నీతి ప్రవర్తన గలవాడై హృదయశుద్ధిని ప్రేమించినవాడు గనుక బానిసగా ఉన్న అతడు బబులోను సామ్రాజ్యములో అందరికంటే ఎక్కువగా హెచ్చింపబడి, ఆ దేశ రాజుకి స్నేహితుడుగా మార్చబడ్డాడు
👉మరి నీవు దానియేలువలె హృదయశుద్ధిని ప్రేమించినట్లైతే మన రారాజు అయిన యేసుక్రీస్తుకి స్నేహితుడుగా మారి, ఆయన రాజ్యములో ఉన్నతస్థితికి చేరుతావు. మరియు నీవు నీకు చెందిన అన్నింటను ఉన్నత స్థాయికి చేరుతావు.........దేవుడు అట్టి రీతిగా మనల్ని దీవించును గాక 🙇🙇🙏🙏ఆమేన్ ఆమేన్

🐤 నీ బాధకు కారణం తెలియడం లేదా? 🐤


🌴 ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదోక అనారోగ్యమునకు మనము తరచూ గురి అవుతూనే ఉంటాము, వాటికి ఏవేవో కారణాలు మనకి మనము లేదా మనకి మన వైద్యులు చెప్తూనే ఉంటారు. కానీ వీటికి కారణం దేవుడు ఏమి చెప్తున్నారు అని మనం చాల తక్కువగా ఆలోచిస్తుంటాము. 

❤ అందుకే దేవుని వాక్యం తెలవిస్తుంది : దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను - నిర్గమ 15:26

🌴 మనం రోగాలకు కారణం మన తిండి అనో లేక వాతావరణం అనో ఇంకా ఏవేవో కారణాలు అని మనం అనుకుంటుంటాము. కానీ దేవుడు చెప్తున్నారు నా వాక్యాన్ని శ్రద్దగా విని వాక్యాన్ని అనుసరించి నా దృష్టికి న్యాయమైన ప్రవర్తన కలిగి జీవిస్తే మీకు రోగాలు రానివ్వను అని. 

❤ హిజ్కియా అన్నిటిలో న్యాయముగా జీవిస్తున్నాడు కదా మరి హిజ్కియాకు మరణకరమైన రోగం రావడం ఏమిటి మనం ఆలోచిస్తామేమో. అవును హిజ్కియా యథార్థ హృదయుడై సత్యముతోనే జీవించాడు కానీ అదే హిజ్కియా స్వస్థపరచబడిన తర్వాత చెప్తున్నాడు "నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి - యెషయా 38:17"

🌴 హిజ్కియా కన్నీటి ప్రార్ధన తనలో ఉన్న ప్రతి చిన్న పాపమును కూడా దేవుడు కడిగి వేసేలా చేసింది కాబట్టే తిరిగి ఆరోగ్యము, ఆయుష్షు పొందుకోగలిగాడు. 

🍎 మరి ఈరోజు నీవు కూడా ఏదోక అస్వస్థతకి గురి అయి ఉన్నావేమో, తరచు నీవు నీ కుటుంబసభ్యులు ఏదొక అనారోగ్యమునకు గురి అవుతున్నారెమో. కారణం వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోవడమే అని దేవుడే చెప్తున్నారు. 

🍎 కాబట్టి మనము కూడా మనలను స్వస్థపరచగల, మన పాపములను కడివేసి మన శరీరానికి, మన ఆత్మకు బలమును అనుగ్రహించే దేవుని ఎదుట కన్నీరు కార్చుదాము.. మన కన్నీరు మన పాపములను దేవుడు కడిగివేసేలా చేయడమే కాకుండా మనకు భౌతిక మరియు ఆత్మీయపరమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించేలా చేస్తుంది. 

🍎 మరి దేవునికి మొర్రపెట్టే విశ్వాసము నీకు ఉందా? ఆయన సన్నిధిలో కన్నీరు కార్చగలిగే సమయం నీకు ఉందా ఒకసారి పరీక్షించుకో...👍🙏

Post a Comment

0 Comments

Join In Telegram