*ఒక ఊరిలో ఒక ""క్రైస్తవ సోదరుడు"" ఉండేవాడు.* ఆ అబ్బాయి చాలా "సంవత్సరాలు" నుంచి దేవునిలో జీవిస్తున్నాడు..
*ప్రతీ ఆదివారం మందిరానికి వెళ్లటం, చర్చి లో జరిగే అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, పరిచర్య చేయటం* అన్నింటిలో బాగానే ఉండేవాడు.
*ఒకరోజు రాత్రి ఆ అబ్బాయికి ఒక ""కల"" వచ్చింది.* ఆ కలలో ఆ అబ్బాయి ఎదురుగా *ఒక పెద్ద "మూట" ఉంది. ఆ మూటను చూసిన అబ్బాయి పట్టించుకోలేదు.* మరొకరోజు రాత్రి కలలో ఇంకొక మూట ఎదురుగా వచ్చింది. మొత్తం "రెండు మూటలు" అయ్యాయి.
*అయిన సరే ఆ అబ్బాయి ఆ మూటలను పట్టించుకోకుండా కలలో తనపని తాను చేసుకుంటున్నాడు.* అలా రోజులు గడిచే కొద్దీ ఆ అబ్బాయి కలలో ఎదురుగా మూటలు పెరిగిపోయాయి.
*ఆ అబ్బాయి ఏమిటబ్బా ప్రతిరోజు నా కలలోకి మూటలు వస్తున్నాయి, అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అని ఆలోచించటం మొదలుపెట్టాడు..*
తన ఎదురుగా *ఆ మూటలు పర్వతం అంత అయిపోయాయి.(అన్ని మూటలు అయిపోయాయి).* ఈ అబ్బాయికి అసలు ఆ కల ఎందుకు వస్తుందో అర్ధం కావట్లేదు, రకరకాల ఆలోచనలతో సతమతమయిపోతున్నాడు.
*ఒక రోజు కలలో దేవుడు కనిపించి నా దగ్గరకు వస్తావా అని ఆ అబ్బాయిని అడిగాడు, ఆ అబ్బాయి సంతోషంగా వస్తాను అని అన్నాడు, అప్పుడు దేవుడు ఐతే రా అని పిలిచాడు* కానీ తన ఎదురుగా పర్వతం అంత ఎత్తుగా వున్నా మూటలను దాటుకుంటూ రావటానికి చాలా ప్రయత్నాలు చేసాడు కానీ ఆ అబ్బాయి వల్ల అవ్వక అక్కడే ఉండిపోయి *దేవుడా!!! నావల్ల కావటం లేదు అసలు ఈ మూటలు ఏమిటి?* నా ఎదురుగా ఎందుకు ఉన్నాయి? అసలు ఇవి ఏమిటి?? అని అడిగాడు.
*అప్పుడు దేవుడు అబ్బాయి ఆ మూటలను విప్పు నీకె తెలుస్తుంది, ఆ మూటలోనివి నువ్వు పూర్తి చేస్తే మూటలు తరిగిపోతాయి, అప్పుడు నువ్వు నాదగ్గరకు పరుగెత్తుకుని వచ్చేయగలవు అని చెప్తాడు.*
*ఆ అబ్బాయి మూటలో ఏమివున్నాయో అని ఆలోచించుకుంటూ ఒక ముట విప్పుతాడు, అందులో నీ కుటుంబం కోసం ఒక్కరోజు కూడా నువ్వు ప్రార్ధన చేయలేదు, నువ్వు ప్రార్ధన చెయ్యి అని ఉంది..*
*మిగిలిన మూటల్లో, నీ సంఘం కోసం, సేవకుని కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, సృష్టి కోసం, నీరు, గాలి, భూమి, ఆకాశం, జంతువులు, కీటకాలు, పర్వతాలు, చెట్లు, ప్రజలు, అన్ని దేశాలు కోసం.. ఇసుక, బియ్యం, పండ్లు, కూరగాయలు, వస్తువులు, అన్ని వృత్తులు చేసేవారి కోసం, *అన్యులు, చెడ్డవారికోసం, నరమాంస భక్షకుల కోసం, బీదలు, అనాధాలు, వికలాంగులు, వృద్ధులు, విధవారాండ్రు, అందరి కోసం ఆ మూటల్లో ప్రార్ధనలు చేయమని ఉన్నాయి*
ఆ అబ్బాయికి అవన్నీ చూసి ఏడుస్తూ, అన్ని విషయాలు కోసం ప్రార్ధనలు చేయటం ప్రారంభించాడు, *అలా ప్రార్ధనలు చేయగా, చేయగా ఆ మూటలు ఒక పెద్ద దారి వలె అయిపోయాయి, ఆ అబ్బాయి ఆ దారిలో నడుచుకుంటూ, పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వెళ్లి ఆయనను కౌగిలించుకుని దేవా నన్ను క్షమించు అని ఎలుగెత్తి ఏడ్చేశాడు* మనం చేసే ప్రార్ధనలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి, కానీ చీమ కుట్టినట్టు కూడా మనకు లేదు. (నిర్లక్ష్యం). మనము పరలోకం వెళ్ళాలి అంటే కచ్చితంగా అన్ని విషయాలు కొరకు ప్రార్ధనా విజ్ఞాపణలు చేసి ముగించాలి, (సమాప్తం చేయాలి) లేకపోతే స్వర్గంలో మనకు స్థానం ఉండదు
*మనము చేసే ప్రార్ధనలు పర్వతం అంత ఎత్తుగా ఉండాలి అంతేగాని* మన నిర్లక్ష్యం వలన చేయటం మానేసిన ప్రార్ధనలు పర్వతం అంత ఉండకూడదు.
*Matthew(మత్తయి సువార్త) 26:41*
*మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి*
*ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ప్రార్ధనలు చేయండి ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏*
0 Comments