సుఖానికి అలవాటుపడ్డ క్రైస్తవులం” ,ఆదివారపు క్రైస్తవులం” ,నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులం" , | |Must Read || Don't Skip || 2 Mins Message Must Read || Do forward Now ||

సుఖానికి అలవాటుపడ్డ క్రైస్తవులం” ,ఆదివారపు క్రైస్తవులం” ,నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులం" , | |Must Read || Don't Skip || 2 Mins Message Must Read || Do forward Now ||


Christian Messages Click here For more messages 




⛔మేము సిలువ గుర్తు ఉన్న చైన్ను మేడలో వేసుకుంటాం…
ఎందుకంటే మేము క్రైస్తవులo…

⛔ సినిమా సెలెబ్రేటిలను డీపీలుగా పెట్టుకుంటాం..
దేవుని వాక్యాలు ఉన్న పోస్టులకు "ఆమెన్" అని కామెంటు చేస్తాo..

⛔మాకు యేసయ్య మీద చాలా నమ్మకం ఉంది ...
ప్రతీ పోస్టును అర్థంచేసుకోకుండా "Amen" అని టైపు చేస్తాo..

⛔క్రైస్తవ whatsapp గ్రూపులో వాక్యాలు షేర్లు చేస్తాo..
కాలేజి whatsapp గ్రూపులో కొత్త సినిమా రివ్యూలు షేర్లు చేస్తాo..

⛔మా పాస్టరుగారి పోస్టులకు, యూట్యూబ్ ఛానల్ లో ఉన్న వీడియోలకు లైకులు , షేర్లు చేస్తాo..
మిగతా పాస్టర్ల పోస్టులకు విమర్శ చేస్తాo యూట్యూబ్ విడియోలని dislike చేస్తాo..

⛔మతోన్మాదులకు భూతులతో జవాబు ఇస్తాo..
 క్రైస్తవులతో మర్యాదగా మాట్లాడుతాo..

⛔మా చర్చి బ్యాండ్ చేతికి వేసుకుంటాo..
ఎవరైనా అడుగితే మా చర్చి గొప్పతనాన్ని చెప్పుకుంటాo..

⛔మా పాస్టర్ గారు ఛాలెంజ్ చేస్తూ డిబేట్లకి రమ్మంటారు..
మిగతా పాస్టర్లకు ఈ రోషం ఈ దమ్ము ఉండదు..

⛔మాకు గ్రీకు/హీబ్రూ భాషలో వాక్యాలకు అర్ధం తెలుసు..
మీకు కనీసం తెలుగు వాక్యాలకు అర్ధం తేలియదు…

⛔నాకున్న అన్య స్నేహితులతో లోకానుసారంగా ఉంటాo
 క్రైస్తవ స్నేహితులతో ఆత్మీయంగా ఉంటాo..

⛔ఆదివారం నాడు ఉదయం తప్పనిసరిగా చర్చికి వెళ్తాo
సాయంత్రం సినిమాకి వెళ్తాo..

⛔నేను వెళ్తున్న చర్చికి లక్షమంది సభ్యులు ఉన్నారు ..
మిగతా సంఘాలన్నీ మా దృష్టిలో చిన్న సంఘాలు..

⛔మా పాస్టర్ గారు చెప్పిందే వేదం...
ఇతర పాస్టర్ల ప్రసంగాలు మాకు అనవసరం..

⛔యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు ..
మా పాస్టర్ గారికి చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు ...

⛔మేము అన్యలులాగా సినిమా హీరో /హీరోయిన్ కు ఫ్యాన్స్ కాదు ..
సేవ చేస్తున్న మా పాస్టర్ గారికి మేము ఫ్యాన్స్...

⛔మేము వాక్యం చెప్తుంటే కనీసం ఐదువేలమంది ఒకేసారి వింటారు..
మనల్లి తప్పుపట్టే అర్హత వారికి లేదు…

⛔మాకు స్వస్థతా వరం ప్రవచనా వరం ఉంది..ఆత్మాభిషేయకం ఉంది..
మా సంఘానికి రండి ..ఆశీర్వాదాలు పొందండి...

⛔ బైకు ఉంటే కారు కొంటారు..మారుతీ కారు ఉంటే బెంజ్ కారు కొంటారు ... 
నమ్ముతున్న వారు మీ పక్కన ఉన్నవారితో చెప్పండి...

⛔మీకు స్వస్థత కావాలంటే మా ఊరిలో ఉన్న సంఘానికి రండి...
మేము స్వస్థపరుస్తాం..

⛔మా సంఘంలో స్వస్థలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు, భాషలలో మాట్లాడుతారు, ఆత్మలో ఊగిపోతూ క్రిందపడిపోతారు ...
ఇతర సంఘాలలో ఇలాంటి “ఉజ్జివం” అసలు ఉండవు...

⛔మా పాస్టర్ గారు 8 క్రైస్తవ చానెల్స్ లో , 5 సెక్యూలర్ ఛానెల్స్ లో వాక్యం చెప్తారు..
మీ పాస్టర్లు అసలు టీవీలో కనపడరు..

⛔మా పాస్టర్ గారు అంతర్జాతీయ ప్రసంగికులు, 20 దేశాలలో తిరిగి సువార్త పని చేసారు...
మీ పాస్టర్ గారు చిన్న పల్లెటూరులో సేవ చేస్తున్నాడు..

⛔లెంటు దినాలు తప్పనిసరిగా ఆచరిస్తాo..
ఉపవాసం ఉంటున్నామని అందరికి చెప్పుకుంటాo…

⛔క్రైస్మస్ పండగకు నాన్వెజ్ వంటకాలను వొండుకొని తింటాం..
అదే సమయంలో బయట ఎవరో ఆకలితో అన్నం అడిగితే తర్వాత రమ్మని అంటాం...

⛔దేవుని పాటలు అద్భుతంగా పాడుతాo..
ఒక క్రైస్తవ మీటింగులో మేము పాడాలంటే కనీసం 30 వేలు తీసుకుంటాం .

⛔దేవునిని అంగీకరించాము , సినిమారంగం వదిలాము ...
ఒక క్రైస్తవ మీటింగులో మేము గెస్టుగా వచ్చి మా సాక్ష్యాన్ని చెప్పాలంటే కనీసం 50 వేలు తీసుకుంటాం...

⛔మనం దేవుని బిడ్డలం...అయన వారసులం.. ఆయన్ని కాకపోతే ఇంకెవ్వరిని అడుగుతాం..
కాబట్టి లగ్జరీ కార్లను , ఐఫోన్లను ప్రార్ధనలో మనం దేవుడిని అడగవచ్చు...

⛔మేము భారతదేశంలో ఉన్న సేవకుల ప్రసంగాలను వినుము..
పాశ్చాత్త దేశాలయుక్క సేవకుల ప్రసంగాలనే వింటాం..

⛔మేము సేవకులందరిని ప్రేమిస్తాం ..
మీరు భోదకులని విమర్శిస్తారు & తీర్పు తీరుస్తారు..

⛔మా కసలు దానం మీద ఆస లేదు కానీ...
ఇతర క్రైస్తవులకు ధన సహాయం చేసే ముందు వడ్డీ రేటుని మాట్లాడుకుంటాం... 

⛔మా పాస్టర్ గారి టీవీ ప్రోగ్రాముకి మేము స్పాన్సర్ చేసాం..
మీరు కూడా స్పాన్సర్ చేయండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి..

⛔మనమంతా క్రైస్తవులము..ఒకే కుటుంబానికి చెందినవారము..
అబద్ధ భోదని చెప్పి ఇలా విమర్శించుకుంటే ఉంటే అన్యుల మధ్య క్రైస్తవ్యం పరువు పోతుంది..

⛔వీధి సువార్త ప్రకటనకు క్రైస్తవులు ఉన్న స్థలాలకే వెళ్ళి ప్రకటిస్తాం..
అన్యలు దగ్గరకు వెళ్తే వ్యతరేయకత వస్తుంది...

⛔క్రైస్తవులైన మేము కులానికి వితరేకం...
కానీ, మా క్యాస్ట్ సర్టిఫికెట్ట్లో ఏ “కులం” ఉందొ మీకు అనవసరం... మేము రిజర్వేషన్లు అనుభవవిస్తాం ..

⛔యేసు ప్రభువు అందరిని ప్రేమించమన్నారు...
అన్ని మతాలు ఒక్కటే చెప్తున్నాయి ...

⛔మనం క్రైస్తవులుగా రాజకీయ నాయకుడిని గౌరవించాలి..
వారు క్రైస్తవ మీటింగులకి ప్రసంగం మధ్యలో వస్తే , ప్రసంగాన్ని ఆపివేసి వారిని సన్మానిస్తాo..

⛔మాకు కావాల్సిన వాక్యాలు మాత్రమే చదువుతాం..
సందర్భం నుంచి వాక్యాలు బయటకు తీసి మాకు ఇష్టం వచ్చినట్టు వాటిని మలుచుకుంటాం..

ఇంతకీ….
పరిచయం చేసుకోవడం మేము మరిచిపోయాము...
మేము "నామకార్ధ క్రైస్తవులం" 


మేము "వేషధారణ క్రైస్తవులం" 
మేము "మారుమనస్సు లేని క్రైస్తవులం"
మేము “అబద్ధ భోధకులం”
మేము "ఆడంబర క్రైస్తవులం"
మేము “సుఖానికి అలవాటుపడ్డ క్రైస్తవులం”
మేము “ ఆదివారపు క్రైస్తవులం”
మేము “నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులం"
—————-————


Post a Comment

0 Comments

Join In Telegram