అపరాధిని యేసయ్యా SONG LYRICS 🎵

అపరాధిని యేసయ్యా SONG LYRICS 🎵

Praise And Worship God 🙏


*🎶 అపరాధిని యేసయ్యా!🎶*

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

1. ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2) ||అపరాధిని||

2. చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2) ||అపరాధిని||

3. శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2) ||అపరాధిని||

4. దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2) ||అపరాధిని||




Post a Comment

0 Comments

Join In Telegram