Song Lyrics
పల్లవి: నిత్యుడా నా యేసయ్యా నీ సన్నిధానములో నీ మొఖము చూడ నేను ఎదురు చూచుచున్నాను ||2||
నీవే ఆధారము నీవే ఆనందము
నీవే నా ఆశ్రయం నీకే నా నీరాజనం ||2||నిత్యుడా||
1)నేనెన్నడూ ఎరుగని ఆ ఎడారి త్రోవలోన నా చేయి వీడకా నీవు నాతోనే నడచావు ||2||
నీ మంచి మాటలు చెప్పి నన్ను ఆదరించావు ఏనాటికి తరగని నీ వాత్సల్యము చూపించితివి ||2||నిత్యుడా||
2)కాలాలే మారినా నీ మమకారం మారలేదు కడగండ్లే ఎదురైనా నీ కృప నన్ను వీడలేదు ||2|| కృతజ్ఞతా స్తుతులతో నీ పాదాలను నే చేరి నా హృదయ మర్పించి నా మ్రొక్కులన్ని చెల్లించెదను ||2||
3)మితిలేని ప్రేమతో నా స్థితినే మార్చినావు ఆత్మీయ శిఖరాలకు నను ఎక్కించ కోరినావు ||2|| అనుగ్రహ పూర్ణుడా నా ఆశ ఒక్కటేనయ్యా నీ మెప్పు పొంది నీ సన్నిధిలో నిలవాలయ్యా ||2|| నిత్యుడా||
0 Comments