పల్లవి: నూతనమైన కృపలతో నన్ను
నడిపించుచున్నావు నీవు (నిత్య) నూతనమైన అనురాగం నాపై కురిపించుచున్నావు నీవు నీ ప్రేమయే నన్నాదరించెను (4)
1.
ప్రవక్తలందరిపైన నీవు నిలిపిన నీ కృపను నాపై నిలిపావు ఘనకార్యములు పూనుకొని ఘన విజయం నే పొందునట్లు నన్నెన్నుకొన్నావు దయతో నీ ప్రేమయే నన్నాదరించెను (4)
2. కీడుచేయువారే నన్ను ఘనపరచుచు దీవించునట్లు కృపచూపావు ఘనకార్యములు పూనుకొని ఘన విజయం నే పొందునట్లు పరలోక సహాయం నీవే నీ ప్రేమయే నన్నాదరించెను (4)
3.నీ వాగ్దానములన్ని నెరవేర్చుచు పరిశుద్ధులతో నన్ను నిలిపావు ఘనకార్యములు పూనుకొని ఘన విజయం
నే పొందునట్లు నీ ఆత్మతో నింపావు
నీ ప్రేమయే నన్నాదరించెను (4)
4.నా దేవుని క్రియలను దాచలేను ప్రకటించకుంటే నాకు శ్రమ ఘనకార్యములు పూనుకొని ఘన విజయం నే పొందునట్లు కన్నీటితో పోరాడెద
నీ ప్రేమయే నన్నాదరించెను (4)
0 Comments