మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురోయ్
సందెపొద్దు SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS
LYRICS
పల్లవి:-
మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురోయ్
సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురోయ్
నింగి నేలంట ఆడి పాడంగా
సంబరాలతో సందడాయెగా
(మట్టిలోన)
చరణం:-+01
బెత్లెహేము ఊరిలో
పశువుల పాకలో
దేవుడై పుట్టినాడురా.......
సుఖమే కోరలేదురా
ఆ చలి రాత్రిలో చీకటంటి బ్రతుకులో
దీపమై వచ్చినాడురా
భేధమే చూపలేదురా
ఎంతో వింత గాథ
దారి చూపే దివ్యతార
పాడే దూతలంత
కదిలొచ్చే గొల్లలంత
అంబరానంటే సంబరాలతో
సందడే ఇలా....
(మట్టిలోన)
చరణం:-+02
(ఓ) వెన్నెలంటి వీధిలో
చల్లనైన చూపుతో
స్నేహమై చేరినాడురా....
ప్రేమనే పంచినాడురా..
అంధకారలోయలో
అంతులేని బాటలో
మనకై వెదకినాడురా...
రక్షణే తెచ్చినాడురా...
ఎంతో వింత గాథ
మరి నిన్నే కోరలేదా
రావా యేసు చెంత
మనసారా వేడుకోగా
అంబరానంటే సంబరాలతో
సందడాయెగ...
THANK YOU FOR VISITING
0 Comments