సామెతలు క్లుప్త ధ్యానములు

సామెతలు క్లుప్త ధ్యానములు

▫——— సామెతలు ———▫
      క్లుప్త ధ్యానములు 


నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 
            సామెతలు 1:15-16

పాపుల మార్గములో నడిస్తే, పర్యవసానాలు ఎట్లా వుంటాయో, తలిదండ్రులు తమబిడ్డలకు స్పష్టముగా బోధించాలి. 

పాపుల మార్గం అదొక రంగుల వలయం, ఆకర్షించే అన్నిరంగులు ఆ మార్గములో తారసపడతాయి. 

అది 
▪అత్యంత విశాలమైనది 
▪క్లబ్స్ & ఫబ్స్
▪బీర్లు, బార్లు 
▪వేశ్యలు 
▪నరహంతకులు 
▪వ్యభిచారులు 
▪త్రాగుబోతులు 
▪దొంగలు 
▪జూదము 
▪అన్యాయము 
▪అల్లరితోకూడిన ఆటపాటలు 
▪సినిమాలు, సీరియల్స్ 
▪పోర్నోగ్రఫి (బూతు సాహిత్యం) 
▪డ్రగ్స్ 
▪శరీరాశ 
▪నేత్రాశ 
▪జీవపుడంబము 
▪ఇతరులకు కీడు కల్పించే ప్రతీ నీచకార్యము ఈ మార్గములోనే తారసపడతాయి. 
🔸కానీ, ఈ మార్గంయొక్క అంతిమ గమ్యం నిత్య మరణం 

ఆ మార్గంలో ప్రయాణించేకొలదీ అది విశాలమవుతుంది. హఠాత్తుగా ఒక దినాన్న రెండుబండల మధ్యలో యిరుక్కున్నట్లుగా, ఊపిరాడకుండా చేసి, చంపేస్తుంది. 

ఈ మార్గములో ప్రయాణించేవారు 
🔹కీడు చెయ్యడానికి పరుగులెత్తుతారు. 
🔹నరహత్య చెయ్యడానికి త్వరపడతారు 
👉 Note: హత్య చేస్తేనే కాదు, తన సహోదరుని ద్వేషించు వాడు కూడా నరహంతకుడే (1 యోహాను 3:15 )

వీళ్ళకి ఎందుకింత తొందర? అంతే. వారు చేయాలనుకొనే పాపము ఎంత తొందరగా చెయ్యడానికి వీలవుతుందో అంత తొందరగా చెయ్యడానికి ప్రయాసపడతారు. ఆలస్యమైతే ఛాన్స్ మిస్ అవుతుందనేది వీళ్ళ భయం. వీరు పొందే ఆనందం, వీరు వేసే ప్రతీ అడుగు శాశ్వతమైన దుఃఖానికి మరింత దగ్గరగా చేర్చుతుంది. 

కుమారుడా!
🔻కనీసం, వారి మార్గం వైపుకూడా చూడొద్దు!
🔻ఆ మార్గంలో అడుగు పెట్టొద్దు!
🔻యిప్పటికే, అడుగుపెడితే? ఇప్పుడైనా వెంటనే నీ పాదం వెనక్కి తీసుకో! 
🔻ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యొద్దు! 

▫దుష్టుల ఆలోచనచొప్పున నడువక 
▫పాపుల మార్గమున నిలువక 
▫అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 
            కీర్తనలు 1:1,2

అవును! నిజమైన ఆనందం వాక్యమైయున్న దేవునియందే! అదే శాశ్వతమైనది. అదే నిన్ను నిత్యరాజ్యానికి నడిపించేది! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Post a Comment

0 Comments

Join In Telegram