అంశం: ప్రార్ధన ( పూర్తి విశ్లేషణ ) || Don't Skip || Must Read Now

అంశం: ప్రార్ధన ( పూర్తి విశ్లేషణ ) || Don't Skip || Must Read Now

✍️ అంశం: ప్రార్ధన ( పూర్తి విశ్లేషణ ) ✍️


                                ప్రార్థన

                క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేకుండా క్రైస్తవునిగాజీవించలేమని మనకు తెలుసు. వ్యక్తిగత జీవిత భౌతిక, ఆత్మీయ అభివృద్ధికి, సంఘఅభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారం. ప్రపంచంలోఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయ రహస్యం ప్రార్థనే.ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యత ఉన్నదని తెలుసుకున్నను అనేకమంది క్రైస్తవులు ప్రార్థనలకొరకు ఎన్నో తీర్మానములు చేసుకున్నను శరీర బలహీనతను, మత్తును జయించలేక తగినంతగాప్రార్థించలేకపోతున్నారు. ఎందుకనగా సొంతశక్తితో ఎవరూ సంపూర్ణమైన ప్రార్థనచేయలేరు.
↪️ ప్రార్థన అంటే ?
▶️ ప్రార్థన అంటేదేవునితో సంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట.
నిజమైన ప్రార్థనఅంటే “మానవాత్మ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడం” అన్నారు చార్లెస్ స్పర్జన్.
▶️ మాటల్లోనూ,మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన. నివురు గప్పిననిప్పులా ఉంటూ నిత్యం దహింపజేసేదిప్రార్థన
▶️ ప్రార్థన ఒకహృదయాభిలాష, అది భాష కందనిది,గుండెలను కదిలించే అజ్ఞాత అగ్నిజ్వాల
▶️ మన పాపాలనుఅంగీకరిస్తూ, దేవుని కనికరానికి ఆయనకుకృతజ్ఞత తెలపడం. అంతేకాదు; క్రీస్తు నామంలో మన అవసరాలను దేవునికి తెలిపి వాటినిఆయన చిత్తానికి యోగ్యంగా ఉండేలా వాటిని ఆయనకు సమర్పించడం ప్రార్థన
▶️ ప్రార్థన అంటేదేవున్ని బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు. ఆయన చిత్తానికి అనుకూలంగా మనల్ని మనంఅంకితం చేయడమే
▶️ ప్రార్థన దేవున్నితెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది
▶️ ప్రార్థన మనందేవునితో మాట్లాడటానికి, మనసు విప్పి ఆయనతో సంభాషించటానికి, మ‍న ఆత్మలోనిఆరాటాన్ని తెలిపి ఆయనలో లీనం కావడానికి దోహదం చేస్తుంది.
▶️ మోకరించే క్రైస్తవుడు ఆయన్ని కనుక్కోగలుగుతున్నాడు: అదేసమయంలో దేవుడు అతన్ని కనుగొంటున్నాడు.
▶️ ప్రార్థన ద్వారా మనఆత్మ దైవ సన్నిధిలో సన్నిహితత్వం పొందుతుంది.
▶️ దేవున్నిదర్శించడమే ప్రార్థన. దైవ దర్శనం లేనిప్రార్థన వ్యర్థం.
▶️ మన అవసరాలనుదేవునికి తెలపడం ప్రార్థనలోని ప్రాముఖ్య అంశం
▶️ ఆయనలో గాఢంగా కలిసిపోవడమే నిజమైన ప్రార్థన.
▶️ హృదయమంతటితో,బలమంతటితో ప్రార్థించడం క్రైస్తవులు ఈ భూమిపై సాధించగలిగిన అంతిమ మహా విజయం .
▶️ పరిశుద్ధాత్ముడుప్రార్థనలో మనకు సహాయకుడు.
▶️ ప్రార్థన మనకున్నఆధిక్యతలన్నిటిలోకి అత్యున్నతమైనది.
▶️ మనబాధ్యతలన్నిటిలోకి అతి గంభీరమైనది. మన చేతుల్లో పెట్టిన మహోన్నత శక్తి ప్రార్థన.
▶️ దేవుని ధననిధితలుపు తెరిచే తాళం చెవి ప్రార్థనే.
↪️ మనము ఎవరికి ప్రార్థన చేయాలి?
▶️ మనము యేసునామములో తండ్రి యైన దేవునికి ప్రార్ధన చేయవలెను (యోహను 14:13, 14:16,23, యాకోబు1:5) మరియమ్మకు గానీ, పరిశుద్ధుకు గానీ, విగ్రహములకు గానీ ప్రార్థించకూడదు.
↪️ మనము ఎందుకు ప్రార్థన చేయాలి?
▶️ మనము దేవుని సహవాసము కొరకు
▶️ పరిశుద్ధముగా జీవించుట కొరకు,
▶️ పాపక్షమాపణ కొరకు,
▶️ మన అవసరతల కొరకు,
▶️ పాపములో పడకుండా దేవుని కృపను పొందుట కొరకు
▶️ ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి
↪️ మనము ప్రార్థన ఎలా చేయాలి ?
▶️ విశ్వాసముతో, పట్టుదలతో (యాకోబు 1:5,6)
▶️ విరిగి నలిగిన శుద్ధ హృదయముతో (కీర్తన 51:17; 68:18)
▶️ పరిశుద్ధాత్మలో ప్రార్థించండి (యూదా 21)
↪️ మనము ఏ సమయంలో ప్రార్థన చేయాలి?
▶️ వేకువ జామున (మార్కు 1:35)
▶️ మద్యాహ్నము (అపొ.కార్య.3:1 10:9)
▶️ రాత్రివేళ (లూకా 6:12)
▶️ భోజనముచేయునపుడు (యోహాను6:11)
▶️ శ్రమలకా లములో (యాకోబు 5:13
▶️ ఆపత్కాలములో (కీర్తనలు 50:15)
▶️ అనారోగ్యములో (యాకోబు 5:14)
▶️ నిత్యము ప్రార్థన చేయవలెను(లూకా 18:1)
↪️ మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి?
▶️ మనో విచారములో ఉన్నపుడు (యోహాను 14)
▶️ మనుషులు మోసగించినపుడు (కీర్తన 27)
▶️ ఫలభరితమైన జీవితం కొరకు (యోహాను 15)
▶️ పాపము చేసినపుడు (కీర్తన 51)
▶️ ఆందోళనకు లోనైనపుడు (మత్తయి 6: 19-34)
▶️ అపాయము ఉన్నపుడు (కీర్తన 91)
▶️ దేవుడు లేడు అనుకున్నపుడు (కీర్తన 139)
▶️ విశ్వసము సడలినపుడు (హెబ్రీ 11)
▶️ ఒంటరితనంతో భయభ్రాంతులయినపుడు (కీర్తన 23)
▶️ చేదైనఅనుభవాలతో క్లిష్ట పరిస్థితులలో ఉన్నపుడు (1 కొరింథి 13)
▶️ సంతోషకరమైన హృదయం కొరకు ( కొలస్సీ 3:12 - 17)
▶️ క్రైస్తవ్యమును సరిగా అర్థంచేసుకొనుటకు - 2 కొరింథి 5: 15-19
▶️ నిరాశలో ఉన్నపుడు – రోమా 8:31
▶️ శాంతి, సమాధానముల కొరకు మత్తయి11:25-30
▶️ ప్రపంచం దేవునికంటే పెద్దదిగా కనిపించినపుడు కీర్తన 90
▶️ క్రీస్తునందు గట్టి నమ్మకం కొరకు - రోమా 8:1-30
▶️ నీ ప్రార్థన స్వార్థపూరితమైనపుడు - కీర్తన 67
▶️ పనిలో ధైర్యం కొరకు – యెహోషువ 1
▶️ సహచరునితో సహవాసం కొరకు – రోమా 12
▶️ నిరుత్సాహంలో ఉన్నపుడు -కీర్తన 27
▶️ పేదరికంలో ఉన్నపుడు – కీర్న 37
▶️ ప్రేమ లోపించినపుడు – 1కొరింథి 13
▶️ దయ లోపించినపుడు -యోహాను 15
▶️ పనిలో నిరుత్సాహపడినపుడు – కీర్తన 126
▶️ భయములో ఉన్నపుడు – కీర్తన 34:7
▶️ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న నిశ్చయత కొరకు – కీర్తన 145:18
↪️ మనము ఎక్కడ ప్రార్థన చేయాలి?
▶️ ఒంటరిగా గదిలో లేక ఏకాంతముగా (మత్తయి 6.6; యెహెజ్కేలు 3:22)
▶️ ఇంటిలో (అపొ. కార్య. 12:12)
▶️ మందిరములో (అపొ.కార్య 4:31)
▶️ గుంపులో మనము ప్రార్దన చేయాలి (అపొ.కార్య. 1:14)
↪️ ప్రార్థనలో ఎలా అడగాలి?
▶️ దేవునిజ్ఞానాన్నిబట్టి అడగాలి (మత్తయి 6:8)
▶️ దేవునిఅంగీకారాన్నిబట్టి అడగాలి (లూకా 11:11-13)
▶️ దేవుని ప్రేమనుబట్టి అడగాలి ( యోహాను 16:23-27)
▶️ క్రీస్తునందునిలిచి అడగాలి ( యోహాను 15:7)
▶️ విశ్వాసంతో అడగాలి ( యాకోబు 1:5,6)
▶️ ఆజ్ఞలు పాటిస్తూఅడగాలి (1 యోహాను 3:22)
▶️ దేవునిచిత్తానుసారంగా అడగాలి (1 యోహాను 3:22)
▶️ గట్టి నమ్మకంతోఅడగాలి (మత్తయి 21:22)
▶️ నిస్వార్థంగాఅడగాలి (యాకోబు 4:2,3)
▶️ క్రీస్తు నామంలోఅడగాలి (యోహాను 15:16)
↪️ మనము ప్రార్థన ఎంతవరకు చేయాలి?
            ▶️ మనము మన ప్రార్దనకు జవాబు వచ్చునంత వరకు ప్రార్దన చేయాలి. ఎంత సమయము ప్రార్దించామన్నది ముఖ్యం కాదు గాని, ఎంత ఆసక్తితో ప్రార్దించామన్నదే ముఖ్యము
↪️ మనము చేసే ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుందా?
▶️ మనము చేసిన ప్రతి ప్రార్దనకు జవాబు వచ్చును
అయితే అవును – వద్దు –కనిపెట్టు అను జవాబులలోఏదో ఒకటి వచ్చును. దావీదు అమాలేకీ యులను తరిమిన యెడల వారిని కలిసికొందునా? అని అడిగినప్పుడు దేవుడు తరుము నీ వారిని దక్కించుకొందువనెను (1సమూయేలు 30:8)                                                                                                        
▶️ బిలాము బాలాకు రాజు పిలుపును అంగీకరించి శ్రాయేలీయులను శపించుటకు వెళ్ళుదును అన్నప్పుడు దేవుడు వద్దు అనెను (సంఖ్యా 22:10-12)                                                                                                          
▶️ అబ్రాహాము తన సంతానమును గురించి వాగ్దానము పొందినప్పటికి దాని నెరవేర్పుకొరకు కనిపెట్టవలసి వచ్చెను (ఆది 15:4; 21: 1,2)
↪️ మన ప్రార్థనలో ఏమి ఉండాలి?
▶️ మోకాళ్ళూని, కన్నులు మూసికొని చెడ్డసంగతులు గాని మంచి సంగతులుగాని తలంపక క్రీస్తు ప్రభువునే తలంచుకొనవలెను. (యోబు11:13, కీర్తన 57:7, హెబ్రి 12:2)
▶️ మన పాపములు, బలహీనతలు ఒప్పుకొనుట ఉండాలి. తలంపులోను, మాటలోను క్రియలోను గలపాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 32:5, యోహాను 1:9)
▶️ నాకు తెలిసిన పాపములు ఇకమీదటచేయకుండుటకు ప్రయత్నము చేసెదనని చెప్పాలి
(కీర్తన 119:112, నెహెమ్యా 10:29,32)
▶️ నాకు కలిగియున్న శరీరమును, ప్రాణమును,ఆత్మను, నా సమస్తమును నీ స్వాధీనము చేయుచున్నానని చెప్పవలెను (ఆది 22:2, రోమా 12)
▶️ స్తుతి, కృత జ్ఞతలు చెల్లించుట ఉండాలి, క్రీస్తు ప్రభువు తొలగించని కష్టములను, తొలగించిన కష్టములను,ప్రభువు చేసిన మేళ్ళను తలంచుకొని ఆయనను స్తుతించవలెను. ఆయన దివ్య లక్షణములను తలంచిస్తుతించవలెను
(కీర్తన 107:2, 19-21, ప్రకటన 15:3,4)
▶️ మన అవసరతలు కోరికలన్నియు చెప్పుకొనిఅడగవలసినవన్నియు అడగవలెను.
(యోహాను 14:14, యెషయా 65:24)
▶️ ఆపై దేవుని ఆత్మ నడిపింపు ననుసరించి అనేక విషయముల కొరకు మనముప్రార్థించాలి
▶️ జవాబు కొరకు కనిపెట్టవలెను. (కీర్తన37:7, యెషయ 40:31)
↪️ మనము ప్రార్థించుట వలన ఫలితమేమి?
▶️ ప్రార్దన ద్వారా మనము దేవుని స్వరమును వినగలము
▶️ మన హృదయము దేవుని హృదయముతో కలియును
▶️ మన శారీరక, మానసిక ఆద్యాత్మిక అవసరతలు తీరును
▶️ మన పాపములు క్షమింపబడును
▶️ ఆధ్యాత్మిక బలము పొందెదము
▶️ సాతాను శోధనలను జయించగలిగెదము
▶️ దేవుని చిత్తమును తెలుసుకొన గలుగుదుము (యెహోను 8:29)
▶️ ఆధ్యాత్మికమర్మములను గూఢమైన సంగతులను గ్రహించుకో గలుగుదుము (యిర్మీయా 33:3)
▶️ దేవునితో సహవాసము కలిగి ఆయనతో నడిచే అనుభవాన్ని పొంద గలుగుదుము.
▶️ దురాత్మలప్రభావము నుండి విడిపించబడుదుము
▶️ దేవుని అద్భత కార్యములు స్వస్ధతలు చూచెదము
▶️ దేవుని వాగ్దానములను సంపాదించుకొని ఆదరణ పొందుదుము
▶️ ప్రార్దన వలన రూపాంతర అనుభవాన్ని పొంది పరిశుద్ధపరచబడుదుము
▶️ ప్రార్థిస్తే ఎంతటి గొప్ప సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తాడు.
▶️ ప్రార్థన వలన క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము,పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి,అలవడతాయి.
↪️ మన ప్రార్థనా జీవితమునకు ఆటంకములు ఏవి?
▶️ పాపము: మన పాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 66:1, యోహాను 1:8,9)
▶️ అవిశ్వాసము: మనము విస్వాసము పొందుటకు దేవుని వాక్యమును వినాలి, చదవాలి, ధ్యానించాలి.
                        (యాకోబు 1:6, రోమా 10: 14-17)
▶️ గర్వము: మనలను మనముతగ్గించుకోవాలి. 1 పేతురు 5:5,6
▶️ స్వార్థము: మనము స్వార్థమువిడిచి , దేవుని చిత్తములో ప్రార్థించాలి. యాకోబు 43:3
▶️ విస్తారమైన పని : ప్రతి దినము ఒకప్రత్యేకమైన స్థలములో ప్రత్యేకమైన సమయమును దేవుని సన్నిధిలో గడపటానికి నిర్ణయించాలి ( లూకా 10:41)
▶️ సోమరితనము : వేకువజామున నిద్రలేచి ప్రార్థించాలి . యోనా 1:6, సామెతలు 6:6, మార్కు 1: 35
▶️ తోటివారితో సరిగా లేకపోవడం: మన హృదయమును సరిచేసుకోవాలి (మత్తయి: 5:23,24)
▶️ నిద్రమత్తు: భయ భక్తులతో మెకాళ్ళమీద నిలబడి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్ధించినచో నిద్రమత్తును జయించగలము (1 తిమోతి 2:8)
▶️ చెదరిన తలంపులు: మనసులోనే ప్రార్ధించినపుడు మన తలంపులు చెదరి పోవడానికి అవకాశమున్నది కాని బగ్గరగా ప్రార్ధంచినచో మన ప్రార్ధింనను మనము వింటాము కాబట్టి మన తలంపులు చెదరిపోవడానికి అవకాశము లేదు
▶️ ఆటంకములు: ఆటంకములను జయించుటకు ఒక ప్రత్యేకమైన సమయం ఒక ఏకాంత స్ధలము నిర్ణయించుకొని ఆ స్ధలంలో ఆ సమయమునందు మనమున్నప్పుడు ఇతరులు మనము ప్రార్ధనలో యున్నామని గ్రహిస్తారు గనుక నీవు ప్రార్ధన చేయునపుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము (మత్తయి 6: 6)
↪️ ఎటువంటి ప్రార్థన చేయకూడదు?
▶️ విస్తరించిన మాటలతో ( మత్తయి 6:7)
▶️ హృదయములో పాపముతో (కీర్తన 66:19)
▶️ ఆయాసపడి (యెషయా 16:12)
▶️ అవిశ్వాసముతో (మార్కు 1:24)
▶️ శయ్యలపై పరుండి (హొషేయ 7:14)
▶️ పరిసయ్యుడిలా (లూకా 18:11,11)
▶️ దీర్ఘ ప్రార్థనలు (మార్కు 12:38-40)
▶️ ధర్మశాస్త్రము వినకుండ (సామెతలు 28:9)
▶️ సమస్యలకు భయపడి దేవుని నిర్ణయమునకు విరోధముగాప్రార్థించకూడదు. (నిర్గమ 3:4-11, 4:1-14)
↪️ ప్రార్థనలకు జవాబురాకపోవడానికి కారణాలు!
▶️ ఒప్పుకోని పాపము (కీర్తన 66:18)   
▶️ వేషధారణతో ప్రార్థించుట ( మత్తయి 6:5)
▶️ అపనమ్మకము గలప్రార్థన (యాకోబు 1:5,6)
▶️ అపవాది క్రియలు (దానియేలు 10: 10-13)
▶️ అభ్యంతరములు కల్గిన ప్రార్థన ( 1 పేతు 3:7)
▶️ గర్వముతో కూడిన ప్రార్థన (లూకా18: 10-14)
▶️ దేవునిది దోచుకుంటూ చేసే ప్రార్థన. (మలాకి 3:8-10)
↪️ బైబిలులోని కొన్ని ప్రార్థనలు:
▶️ చనిపోయిన విధవరాలి కుమారుని కొరకు ఏలియాయెక్క ప్రార్థన (1రాజు 17:20-21)
▶️ ఒకశతాధిపతి తనసేవకుని కొరకు చేసన ప్రార్థన (మత్తయి8:5-9)
▶️ అపవిత్రాత్మ పట్టినాడొకడు తనకొరకు తానే చేసిన ప్రార్థన (మార్కు 5:6)
▶️ అధికారి తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన (మత్తయి 9:18)
▶️ రక్రస్రావరోగముగల స్త్రీ తనకొరకు తానే సేసిన ప్రార్థన (మత్తయి 9:20,21)
▶️ ఇద్దరు గ్రుడ్డివారు తమకొరకు తామే చేసిన ప్రార్థన (మత్తయి 9:27)
▶️ ఒకకానాను స్త్రీ తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన (మత్తయి 15:21-28)
▶️ బర్తిమయి తనకొరకు తానే చెసిన ప్రార్థన (మార్కు 10:46,47)
▶️ మార్తామరియలు వ్యాధిగ్రస్తుడైన తన తమ్మునికొరకు చేసిన ప్రార్థన (యోహాను 11;30)
▶️ పౌలు పాప్లి యొక్క తండ్రి కొరకు చేసిన ప్రార్థన (అపో.28:8)
▶️ ఒక ప్రధాని తన కుమారుని కొరకు చేసిన ప్రార్థన (యోహాను 4:46-50)
▶️ చనిపోయిన విధవరాలి కుమారుని కొరకు ఏలియా యొక్క ప్రార్థన (1రాజులు 17;20,21)
▶️ చనిపోయిన షూనేమీయురాలి కొరకు ఎలీషా ప్రార్థన (2 రాజులు4;33-35)
▶️ చనిపోయిన దొర్కా (తబితా) కొరకు పేతురు యొక్క ప్రార్థన (అపో.28:8)
▶️ పన్నెండు గొత్రీకులను ఆశీర్వదించమని యాకోబు చేసిన ప్రార్థన (ఆది.48-49)
▶️ ఐగుప్తు నుండి విడిపించమని ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన (నిర్గమ 2:23)
▶️ ఇశ్రాయేలీయులను బాధించకుండునట్లు మోషే చేసిన ప్రార్థన (నిర్గమ32:31,32 సంఖ్యా 11:1,2 21:7-9)
▶️ ఇశ్రాయేలీయులను సంరక్షించమని మోషే చేసిన ప్రార్థన (సంఖ్యా10:35,36 )
▶️ తమ్మును నడిపిమచుటకొరకు ఇశ్రాయేలీయిలు చేసిన ప్రార్థన ( న్యాయా1:1)
↪️ బైబిలులోని క్లుప్త ప్రార్థనలు
▶️సుంకరి ౼ ప్రభువా, నన్ను కరుణించుము - లూకా 18:13
▶️ పేతురు ౼ ప్రభువా, నన్నురక్షించుము - మత్తయి 14:30
▶️ దావీదు - ప్రభువా నన్ను పరిశోధించుము - కీర్తన 139: 23
▶️ కుష్ఠురోగి - ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయుము – మత్తయి 8:2      
▶️ దావీదు - ప్రభువా, నన్ను కడుగుము – కీర్తన51:2  
▶️ సమూయేలు - ప్రభువా, ఆజ్ఞయిమ్ము – 1 సమూయేలు 3:10
▶️ మానోహ - ప్రభువా, మాకు నేర్పించుము – న్యాయాధి13:8
▶️ శిష్యులు - ప్రభువా, ప్రార్థన నేర్పుము – లూకా 11:1
▶️ కనాను స్త్రీ - ప్రభువా, నాకు సహాయము చేయుము – మత్తయి15:25
▶️ సమ్సోను - ప్రభువా, నన్ను బలపరచుము – న్యాయాధి16:16:28          
▶️ సిలువపై దొంగ - యేసూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుము – లూకా 23:42
▶️ మోషే - ప్రభువా, నీ మహిమనునాకు చూపుము – నిర్గమ 33:18
▶️ పౌలు - ప్రభువా, నేనేమిచేయవలెను – అపొ.కార్య. 22:10
▶️ యెషయా - ప్రభువా, నన్ను పంపుము – యెషయా 6:8
↪️ యేసుప్రభువు ఆయా సంధర్భములలో చేసిన ప్రార్థనలు
▶️ యోర్దాను నదిలో బాప్తీస్మము పొందినప్పుడు ప్రార్థించెను(లూకా 3:21)
▶️ ఇంకను చీకటిఉండగానే ఏకాంత స్థలముకు వెళ్ళి ప్రార్థించెను. (మార్కు 1:35)
▶️ అరణ్యములోనికివెళ్ళి ప్రార్థించెను (లూకా 6:12)
▶️ శిష్యులనుఎన్నుకొనుటకు ముందు, రాత్రంతా ప్రార్థించెను (లూకా 6:12)
▶️ ప్రయాసపడి భారముమోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి... అని చెప్పుటకు ముందుప్రార్థించెను (మత్తయి 11:25-27)
▶️ అయిదు రొట్టెలురెండు చేపలు పంచిపెట్టుకు ముందు ప్రార్థించెను (యోహాను 6:11)
▶️ అయిదు రొట్టెలు,రెండు చేపలు పంచిపెట్టిన తరువాత ప్రార్థించెను. (మత్తయి 14:23)
▶️ శిష్యులకు ప్రార్థననేర్పుటకు ముందు ప్రార్థించెను (లూకా 11:1-4)
▶️ నేనెవరినినని జనులుచెప్పుకొనుచున్నారని అడుగుటకు ముందు ఒంటరిగా ప్రార్థించెను (లూకా 9:18)
▶️ రూపాంతరము పొందుటకుముందు ప్రార్థించెను (లూకా 9:28,29)
▶️ శిష్యులు దయ్యములనునీ నామమున వెళ్ళగొట్టితిమని చెప్పిన సమధర్భములో ప్రార్థించెను (లూకా 10:21)
▶️ చిన్నపిల్లల కొరకుచేతులుంచి ప్రార్థించెను (మత్తయి 19:13)
▶️ సమాధిలో ఉన్నలాజరును బ్రతికించుటకు ముందు ప్రార్థించెను (యోహాను 11:41,42)
▶️ యెరూషలేములోనిమందిరములో ప్రార్థించెను (యోహాను 12:27,28)
▶️ ప్రభురాత్రి భోజనముముందు ప్రార్థించెను (మత్తయి 26:26,27)
ప్రార్థన నిన్ను సరిచేస్తుంది
ప్రార్థన నీకు జ్ఞానము నిస్తుంది
ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారమవుతుంది
ప్రార్థన నీ ప్రతి అవసరతను తీరుస్తుంది
ప్రార్థన వలన నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది
ప్రార్థన నీకు మంచి ఆలోచనలనిస్తుంది
ప్రార్థన ద్వారా దేవుని ప్రేమతో నింపబడతావు
ప్రార్థన వలన దేవుని వాగ్దానములు నీపట్ల నెరువేరుతాయి
ప్రార్థన ద్వారా దేవుని కరుణ కృప నీమిద నీ కుటుంబము మిద కుమ్మరింపబడుతుంది
ప్రార్థన కీడు రాకుండాకాపాడుతుంది
ప్రార్థన ద్వారా నీవు ఆత్మతో నింపబడతావు
ప్రార్థన ద్వారా శత్రువుపై జయం కలుగుతుంది
ప్రార్థన ద్వారా దైవ చిత్తమును నెరవేర్చే శక్తివస్తుంది
↪️ వివిధ రకాలైన ప్రా ర్ధనలు
▶️ విధేయతగల్గిన,తగ్గింపుగల ప్రార్ధన కీర్తన 101:17
▶️ ధైర్యపరుచు ఆత్మ ప్రార్ధన 1యెహో 5:13-15
▶️ నమ్మకంగల్గిన ప్రార్ధన హెబ్రీ 1:6                                 
▶️ నిజముగా మొర్ర పెట్టు ప్రార్ధన కీర్తన 145:18
▶️ సహజమైన ప్రార్ధన మత్తయి 6:7
▶️ దీర్ఘశాంతపు ప్రార్ధన లూక 18:7, కొల 4:2                                                     
▶️ దేవుని చిత్తానుసారమైనప్రార్ధన 1యెహాను 5:15                               
↪️ అనేకుల కొరకు విజ్ఞపన ప్రార్ధన ఎలా చేయాలి?
నీ కుడిచేతిని నీ ఎదురుగా ఉంచుకొని నీ చేతి వ్రేళ్ళను చూస్తూ అనేక బారముల కొరకు మరువకుండా ప్రార్ధించవచ్చు
✋ బొటన వ్రేలు : ఈ బొటన వ్రేలు మీకు దగ్గరగా ఉంది. కాబట్టి ఈ బొటనవ్రేలు చూచినప్పుడెల్లా మీ కుటుంబము కొరకు, రక్తసంబంధుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్ధంచండి
✋ చూపుడు వ్రేలు : సాధారణముగా ఉపాధ్యాయులు, బోధకులు ఈ చూపుడు వ్రేలును చూపిస్తూ, మనల్ని హెచ్చరిస్తూ బోధిస్తూ యుందురు కాబట్టీ ఈ వ్రేలు చూచినప్పుడల్లా ఉపాధ్యాయుల కొరకు, నడిపించువారికొరకు ప్రార్ధించండి!
✋ మధ్య వ్రేలు : ఇది అన్ని వ్రేళ్ళకంటే ఎత్తుగా ఉన్నది. గనుక ఇది రాజులకు, అధికారులకు గుర్తుగా ఉన్నది, ఈ మద్య వ్రేలును చూచినప్పుడల్లా, రాజుల కొరకు, అదికారుల కొరకు ప్రార్ధించండి
✋ బలహీనమైన వ్రేలు: ఈ బలహీనమైన వ్రేలును చూచినప్పుడల్లాబలహీనుల కొరకు, పేదల కొరకు, వ్యాధిగ్రస్ధుల కొరకు ప్రార్ధంచండి
✋ చివరిగా చిటికెన వ్రేలు : ఈ చిటికెన వ్రేలు చూచినప్పుడల్లాప్రభువా చిన్నవాడిని నన్ను కనికరించు అని నీ కొరకు, నీ అవసరతల కొరకు ప్రార్ధించుకొనుము
ఈ ఐదు వ్రేళ్ళ ప్రార్ధన గుర్తుంచుకోండి అందరి కొరకు ప్రార్ధన చేయండి.
కన్నీటితో కడిగిన ముఖం దేవునికి బహు సుందరముగా కనబడును. గనుక కన్నీటి ప్రార్ధన చేయండి
మీ మోకాళ్ళు నల్లగా ఉంటె, మీ ముఖం తెల్లగా ఉండునన్నాడు ఓ భక్తుడు. కాబట్టి మోకాళ్ళపై ప్రార్ధించటం నేర్చుకోండి. నీవు ఒకదాని విషయం కష్టపడుతూ గుండ్రంగా దానిచూట్టూ తిరుగుతు వుండి,నేనెందుకు ఎదగలేక పోతున్నానని ఆశ్చర్య పోతున్నావంటే దాని అర్ధం నీవు ప్రార్థన నేర్చుకోలేదనే చెప్పాలి. దేవుడు మానవున్నిసృష్టంచినప్పుడు, మానవునితో సహవాసం చేయడం ఆయన ముఖ్య ఉద్దేశ్యం. దేవునితో ఏకాంతంగా సన్నిహితంగా ఉండే స్ధలానికి నీవు వెళ్లకపోతే, దేవునితో నీవు పైపై సంబంధమును మాత్రమే కలిగియుంటావు. దేవునితో ఏకాంతంగా గడపడానికి నీకు ఒక రహస్య స్ధలము లేకపోతే, వెంటనే ఆలాంటిది నీకు ఒకటి కావాలి. ప్రభువుతో నీవు ఏకాంత గదిలోనికి ప్రవేశించినపుడు మొట్టమొదట నీవుచేయాల్సిన పని ఆయన సన్నిధి అక్కడ ఉందని తెలుసుకోవాలి. నీవు ప్రార్థించునపుడు బైబిలు సత్యములను, బైబిలు వచనాలను స్మరించడము కూడ నీకు ఎంతో సహాయపడుతుంది. దేవునితో సంభాషించడము, మరియు సహవాసమును కోల్పోతే నీవు శక్తిని కూడాకోల్పోతావు. అదెలా ఉంటుందంటే కరెంటు కనెక్షను తీసివేయబడిన విద్యుత్ పరికరంలా ఉంటుంది.
ఇటువంటి ప్రార్ధన మన జీవితములో ఒక భాగం కావాలి. ఈ అంశం ద్వార ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డారు కదా? ఇతరుల మేలు కొరకు Share చేయండి. అలా దేవుని సేవలో పాలి భాగస్థులు అవ్వండి. దేవుడు మిమ్ము దీవించును గాక! ఆమెన్!!!


Post a Comment

0 Comments

Join In Telegram