లోకం ఎంగిలి చేసిన జీవితం దేవునికెందుకు....❓ || Must Read Now || Don't Skip || 2 Minutes Message ||

లోకం ఎంగిలి చేసిన జీవితం దేవునికెందుకు....❓ || Must Read Now || Don't Skip || 2 Minutes Message ||

🔴 లోకం ఎంగిలి చేసిన జీవితం దేవునికెందుకు....❓



         👉 ఒకరోజు.......డి.ఎల్.మూడి. గారు
 
ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళారు అపుడు ఆ హీరోయిన్ గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని సంతోషించి లోపటికి ఆహ్వానించి .....ఒక కప్పులో కాఫీ తెచ్చి ఇచ్చింది 
🔹అపుడు డి. ఎల్.మూడి గారు ఆ అమ్మాయి తో మాట్లాడుతూ ......అమ్మా చూడ్డానికి చక్కగా వున్నావు మంచి మాటతీరు గలదానివి దేవుడు నీకు మంచి తలాంతులు యిచ్చాడు ఇవన్నీ పక్కన పెట్టి సినిమాలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా అని చెబితే ....దానికి...
ఆ హీరోయిన్ చెప్పిన మాటలు....
👉 అయ్యా నాకు నీతిగా,ప్రభువు కొరకు జీవించాలని ఉంది కాని ఈ మధ్యనే మూడు సినిమాలు హిట్ అయ్యాయి సినిమా ఆఫర్లు పెరిగాయి కాబట్టి ఇపుడే ఎక్కువ సినిమాల్లో నటించి డబ్బు సంపాదించాలి 
వయస్సు పెరిగిన తరువాత అందము పోయిన తరువాత సినిమా ఫీల్డులో కొనసాగడం కష్టం అప్పుడు నేను కచ్చితంగా వచ్చి దేవుని బిడ్డగా మారిపోయి దేవునికి సాక్షిగా జీవిస్తాను అని బదులు చెప్పిందట......... 
👉 అపుడు డ్.ఎల్.మూడి గారు మధ్యలోనే కాఫీ తాగటం మానేసి అమ్మా 
👉 నేను ఈ కాఫీ సగం త్రాగాను మిగిలింది నువ్వు త్రాగు.......అని చెప్పి ఆ సగం కాఫీ ఆమెకి ఇవ్వబోగా ఆమె బహు కోపంతో౼ 
ఏదేమిటండీ పాస్టరు గారు.......
🔹 మీరు సగం త్రాగి మిగిలింది నన్ను తాగమంట్టున్నారు .....మీరు ఎంగిలి చేసిన కప్పు నేను ఎలా త్రాగగలను ??
👉 ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద ,గౌరవము❓ ఇదేనా మీరు నేర్పిస్తున్న ఆత్మీయత ❓
👉 అని ఎదురుగా వున్న దైవజనుడు గొప్పవారని గ్రహించకుండా ఆ హీరోయిన్ తన ఆవేశమంతా వెళ్లగక్కేసింది ......
🔹మవునంగా మాటలన్నీ వింటున్న డ్.ఎల్. మూడి గారు సరేనమ్మా అయితే ......
దేవుని సేవకూడనైన నేను ఎంగిలి చేసిన కప్పును ఇచ్చి మిగిలింది త్రాగమంటేనే ఇన్ని మాటలు అంటున్నావే.....
👉 నిన్ను లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇప్పుడు నీకున్న అందం ,సత్తువ, సమస్తం ఉడికిపోయిన తరువాత....... ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తేలిన తరువాత.......దేవుని దగ్గరకు వచ్చి ౼ప్రభువా ! ఇదిగో లోకం ఎంగిలి చేసిన నా జీవితాన్ని, బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని నీవు అన్నపుడు దేవుడు వకవేళ నీవు ఇప్పుడు కోపాపడిన విధంగానే కోపాపడితే ఏమి చేస్తావు ❓
ఒక సేవకూడనైన నేను ఎంగిలి చేసిన కప్పును ఇస్తేనే అంత కోపం వచ్చిందే !! 
👉 మరి దేవుడు నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు
👉 ఈ దేహం దేవుని ఆలయం నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలో నీ ఇష్టానుసారముగా పాపపు పనులు చేసి లోకమంతా ఎంగిలి చేసిన తరువాత అప్పుడు వచ్చి ఇదిగో ప్రభువా నా జీవితం నీకు ఇస్తున్నాను అన్నపుడు ........
..........ఛీ....!! పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తరువాత ఇపుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తానంటున్నావు ........నాకు అవసరం లేదు పో అని ప్రభు అన్నట్లుయితే నువ్వు ఎక్కడికి వెళతావో తెలుసా ❓
👉 తిన్నగా నరకానికి వెళ్తావు ..
🔹 జీవం లేని కప్పును ఎంగిలి చేయమంటేనే 
నీకు అంత కోపం వచ్చిందే .......
👉 జీవం ఉన్న నీవు ఎంగిలి అయిన తరువాత దేవునికి సమర్పించు కుంట్టానంటే ......ఆయనకు ఎంత కోప రావాలో ఒక్కసారి ఆలోచించు అని అనగానే ......
ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బల్లెపు పోటులా దిగాయి ......
🔹 ఆమె ఒక్కసారిగా తన మోకాళ్ళ మీద పడి పచ్ఛాత్తాపంతో దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను .......
నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకే ఇకనుంచి జీవిస్తాను అని తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంది.......
👉 సహోదరి.....సహోదరుడా !!! 
నీ యవ్వన శరీరాన్ని ,నీ జీవితాన్ని , నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులును లోకానికి, సైతానుకి, అమ్ముకుని ఆ పాపం లోనే జీవిస్తూ ....నీ జీవితాన్ని నాశనం చేసుకుని .......ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తరువాత......నిను కన్న తల్లిదండ్రులే.....నిన్ను .... ఛీఛీ....అన్న తరువాత
🔹నీ వయస్సు అయిపోయిన తరువాత నీలో ఉన్న బలం, సత్తువ, ఉడిగి.. ఎంగిలి అయిన తర్వాత దేవుడు దగ్గరకు వచ్చి ప్రభువా !!!నేను నీకు ఏమైనా ఉపయోగ పడతానా......❓
అని అపుడు దేవున్ని ప్రాధేయపడటమ్ కంటె ......
నీ యవ్వన ప్రాయములోనే నీలో బలం ఉన్నపుడే నిన్ను లోకం ఎంగిలి చేయక ముందే ఈ లోక మాలిన్యం నిన్ను అంతకుముందే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఎంత బాగుంటుంది....... 
👉 యేసేపు యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టాడు 
పవిత్రమైన తన జీవితాన్ని పాపం చేత ఎంగిలి కానివ్వలేదు ......   
👉 దేశానికే అధిపతిగా చేయబడ్డాడు....
👉 వస్తావా జీవముగల దేవుని దగ్గరకు....
👉 ఇస్తావా ఈ రోజు అయినా దేవునికి.......
👉 నీ జీవితాన్ని, నీ హృదయాన్ని.....

Post a Comment

0 Comments

Join In Telegram