*(కీర్తనలు 18: 33)*
*ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.*
🍋మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమైయుంటాము. పని చేయడం కొందరికి ఆనందం మరి కొందరికి బాధ్యత. ఇష్టమైన పనిని ఎంత కష్టమైన చేస్తాం. ఇష్టం కాకపోతే నిదానంగా చేయగల పనులను కూడా వాయిదాలు వేస్తుంటాం! మనకు నచ్చని పనులు చేయకుండా ఉండుటకు ఏవేవో సాకులు చెబుతూ వాటిని ప్రక్కనాపెడుతుంటా!.
🦋అలాగే సర్వాన్ని సృష్టించిన దేవుడు కూడా కొన్ని పనులలో నిమగ్నమై ఉన్నాడు.ఆయనను నమ్మిన వారి యొక్క కోరికలు నేరవెర్చడమే దేవుని యొక్క సంకల్పం ఆ సంకల్పం నుండి దేవున్ని ఎవరు పక్కకు తీసుకు వెళ్ళలేరు తనను నమ్మిన వారి యెడల తన సంకల్పాన్ని నెలవెర్చడం దేవునికి మహా ఇష్టం.వ్యతిరేక శక్తులు,
సాతానుబంధాకలు ఆయన సంకల్పాన్ని ఎంత మాత్రము ఆటాంకపరచలేవు.
🍋 విశ్వాసంలో బలంగా ఉన్నవారిని ఉన్నతమైన స్థలంలో నిలువబెట్టడం దేవునికున్న మహశయం. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనలో స్ఫూర్తిని రాగిలిస్తాయి. పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి వారిని తన ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయం చేయడం దేవుని పని.
🦋ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఆ రాజ్యానికి తిరుగులేని రాజుగా నిలబెట్టాడు ఇప్పుడు పదుల సంఖ్యలో గొర్రెలను కాస్తుంటే.... భవిష్యత్తులో వందల సంఖ్యలో కచే అవకాశం ఉండవచ్చు అనేది ప్రజాభిప్రాయం.అలాగే దావీదు మనస్సులోని ఆలోచన కూడా బహుశా ఇదే కావచ్చు.
🦋కానీ మానవ అంచనాలను పటాపంచలు చేసే శక్తి దేవునిది. ఊహలకు అందని మెలులు చేసే మహా ఘనుడు మన దేవుడు.గొర్రెలు కాసుకునే దావీదును ఇశ్రాయేలు రాజ్యాన్ని నలభై సంవత్సారాలు అధ్బుతరితిలో పాలించగలిగే రాజుగా నిలబెట్టాడు. రాజ్యాన్ని అప్పగించిన దేవుడు దావీదు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను నెలవేర్చడు.
🍋 *ఎందరినో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలబెట్టాడు?ఎందరినో కృంగిపోయినవారిని లేవనెత్తిన దేవుడు నిన్నేందుకు లేవనెత్తడు?*
పడిపోయిన మనిషిని నిలబెట్టడమే దేవుని పని.
🦋పాపము అనే అగాథ స్థలములో చిక్కుకుపోయిన మానవునికి తన కరుణ హస్తములను అందించి వారిని ఉన్నత స్థలములో నిలువబెట్టి తన ప్రేమను చూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఉన్నతమైన అనుభవాలతో, ఆశయాలతో ఆశీర్వాదాలతో మనలను నడిపే క్రీస్తుకు సాటియైన వారు ఎవరైనా ఉన్నారా?
👉కాబట్టి ప్రియ సహోదరీ! సహోదరుడా! నీ జీవితంలో నీకున్న కష్టాలను బట్టి నీకున్న సమస్యలను బట్టి సమాధానం లేకుండా జీవిస్తున్నవేమో సమస్యల సుడిగుండంలలో నుండి లేవలేకపొతున్నవెమో! నిన్ను లేవనెత్తి నిన్ను నిలబెట్టే దేవుడు నీకున్నడు అని మరచిపోకు. ఆ రోజు దావీదును నిలబెట్టుకున్న దేవుడు ఈ రోజు నిన్ను కుడా నిలబెట్టుకుంటాడు అని గుర్తుపెట్టుకో..
🙌కాబట్టి ఈ రోజే నీ జీవితన్ని యేసయ్యా చేతికి సంపూర్తిగా అప్పగిస్తే దీనులను లేవనెత్తే దేవుడు ఈ క్షణమే నువ్వు వున్న స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి ఆయన సాక్షిగా అయన చిత్తాన్ని నెరవేర్చే కుమారునిగా, కుమార్తెగా నిన్ను వాడుకంటాడు....🙏👍
ఇటువంటి ధన్యత కృప భాగ్యము దేవుడు మనందరికి దయ చేయును గాక ఆమెన్....
🙏🙏🙏🙏
THANK YOU FOR VISITING THIS BLOG
***************************************
* Follow the Page *
* *********
In This Blogger I Will Post
#Christain Song Lyrics
#Christain Ringtones (Mobile Ringtones)
#Songs Book PDF
So On.....!
For Above All Check In Menu Bar
*****************************************
0 Comments