Life Changing Message
2 Minutes Reading Message
Click here for more Messages
“దినములు చెడ్డవి గనుక,
మీరు సమయమును పోనియ్యక
సద్వినియోగము చేసికొనుచు,
అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు
జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము
మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి." (ఎఫెసీయులకు 5:15-17)
ప్రియమైన సహోదరి, సహోదరులారా పై వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే
అపొస్తులుడైన పౌలు
చాలా ముఖ్యమైన విషయాలను చెప్పారు.
అయితే ఈ రోజుల్లో మసందరూ సమయాన్ని
90% శాతం వృధా చేసుకుంటున్నాము.
ఏ విధముగ అంటే ఈ రోజుల్లో
స్మార్ట్ ఫోన్ లేని వాడు ఎవడూ లేడు.
స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలతో
మన సమయాన్ని పూర్తిగా గడిపేస్తున్నాము.
ఇక్కడే సాతాను మనకు వల విసరుతున్నాడు.
ఎలాగంటే మనము ఎక్కువ సేపు ప్రార్ధన చేయకుండా,
బైబిలు ధ్యానించడకుండా,
ఇతర దైవిక విషయాలను గురించి ఆలోచించకుండా
మన సమయాన్ని వృధాపరుస్తున్నాడు.
సెల్ ఫోను, సోషల్ మీడియాల తో మనము ఎంత సేపు మసం కాలం గడుపుతామనే విషయాన్ని ఎవరికి వారు ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి.
1 లేక 2 గంటలు చాలు.
కాని చాలామంది లేచిన దగ్గర నుంచి
అర్ధరాత్రి వరకు సెల్ ఫోనుతో కాలం గడుపుతున్నారు.
ఇది చాలా దురదృష్టకర పరిణామం.
దీని వలన ప్రార్ధన అంటే చిరాకు, విసుకు, ఆసక్తి లేకపోవడం జరుగుతుంది.
అలాగే బైబిల్ చదవడానికి, ధ్యానించడానికి
ఇంకా ఆసక్తి ఉండదు.
ఈ మధ్య సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది.
ప్రతిదానికి సెల్ఫీ.. బ్యాంకులో ఉంటే సెల్ఫీ.. భోజసం తింటే సెల్ఫీ.. బీచ్ లో ఉండే సెల్ఫీ... బైక్ మీద ఉంటే సెల్ఫీ.. కుక్కతో ఆడుకుంటే సెల్ఫీ.. పిల్లలతో ఆటలాడుతుంటే సెల్ఫీ..బయటకు వస్తే సెల్ఫీ.. లోపలికి వస్తే సెల్ఫీ..
క్రైస్తవులు జ్ఞాన యుక్తముగా ప్రవర్తించాలి
కాని అజ్ఞానముగా
ప్రవర్తించకూడదు.
మనందరం సెల్ ఫోనుకు పాస్ వర్డ్ పెట్టుకుంటాము.
ఆ పాస్వర్డ్ మసకు తప్ప ఎవరికి తెలియదు.
సెల్ ఫోనును ఓపెన్ చేయాలంటే
పాస్ వర్డ్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
మన సెల్‌ఫోన్లో అసలు పనికి వచ్చే,
పనికిరానివి ఏవి ఉన్నాయో మనకు మాత్రమే తెలుసు.
కాని మన హృదయంలో ఏమి ఉందో తెలుసుకోవడానికి దేవునికి పాస్ వర్డ్
మన హృదయంలో ఏముందో , మన ఆత్మీయ స్థితి ఏవిధంగా ఉందో అందరికీ దేవుడైన
యెహోవా (యేసుక్రీస్తు) స్పష్టంగా చూడగలరు.
కాబట్టి ఆలోచించుకోండి. సమయాన్ని వృధా చేసుకొని ఆత్మీయ స్థితిలో సులివెచ్చని స్థితిలోకి మారిపోవద్దని మనవి.
ఎందుకంటే మనం చివరి రోజుల్లో అంటే చెడ్డ దినాల్లో ఉన్నాము కాబట్టి సమయాన్ని వృధాపరచుకొంటే పరలోకంలో మనకు స్థానం ఉంటుందో, లేదో పశ్నించుకోవాలి.
సెల్‌ఫోన్ అనేది సమయాన్ని దొంగలించే ఒక పరికరం.
దానిని మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిది.
ఆన్‌లైన్లో కన్నా offlineన్లో ఆత్మీయ జీవితం
ఎక్కువగా బలపడుతుంది.
ఎందుకంటే జీవం లేని సెల్ఫతో కాలం గడుపుట కంటే
జీవం గల దేవుడైన
యెహోవా (యేసుక్రీస్తు)ను స్తుతించుట మంచిది.
ఎవరి ఆత్మీయ స్థితి అభివృద్ధి వారి చేతుల్లో ఉంటుంది. మీరు సెల్ ఫోన్ వాక్యాలు విన్న, ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొన్న ఇవి కొంత మేరకు మాత్రమే మీకు ఆత్మీయ మేలులు చేస్తాయి.
కాని వ్యక్తిగతంగా అంటే సెల్ ఫోన్ లేకుండా దేవునిలో గడపాలి. మసం చనిపోయిన తరువాత మన సెల్‌ఫోన్ మనతో రాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.
కాబట్టి దేవున్ని స్తుతించకుండా, మహిమపర్చకుండా చేస్తున్న ప్రతి దాన్ని ఆఖరికి మన సెల్‌ఫోన్ నైనా మనం దూరం పెట్టాలి.
లేదు నా ఇష్టం వచ్చినట్లు చేసే హక్కు నాకున్నది అనుకుంటే దానికి మనం వెల చెల్లించవలసి ఉంటుంది.
అది నరకమో మరి ఏదో.. కాబట్టి ఆలోచించండి..
అంత్య దినాల్లో మనుష్యులు
సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు.
టెక్నాలజీ అవసరమే కాని మన సమయాన్ని
దొంగలించనంత సేపే మంచిది.
దొంగిలించేతే వెంటనే దాన్ని కూడా పక్కన పెట్టేయాలి.
మనకు పరలోకం ముఖ్యం. సెల్‌ఫోన్ కాదు
0 Comments