దేవుని ప్రేమ vs లోక ప్రేమ
యేసుక్రీస్తు ప్రేమ
శాశ్వతమైన ప్రేమ
(ఇది స్వచ్ఛమైనది.. పరిశుద్ధమైనది)
లోక ప్రేమలో యవనస్తులు/యవనస్తురాలు మోసపోతున్నారు
నేడు లోకంలో ప్రేమ అనే మాయలో ఎంతోమంది యవనస్తులు చిక్కుకొని ఉన్నారు
సాతాను లోక ప్రేమ వైపు యవనస్తులను ఆకర్షిస్తుండు ఇది తెలియక యవనస్తులు లోక ప్రేమ వైపు సాతాను వలలో చిక్కుకుని ఉంటున్నారు
నేడు యువకుడు యువతిని ఎలా ఆకర్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు
నేడు యువతి అందచందాలతో యువకుడిని ఎలా ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తోంది
*మనుషుల ప్రేమ స్వార్థముతో కూడుకున్న ప్రేమ .అవును ఏదైనా అవసరముంటే మనలను ప్రేమిస్తారు. అవసరము తీరిపోయాక చివరికి మనమీదే లేనిపోనివి చెబుతారు. స్వార్థముతో కూడుకున్న ప్రేమ. అవసరానికి వాడుకొని వదిలివేసి ప్రేమయే మనుషుల ప్రేమ*.
*
* *మనతో అవసరమున్నదంటే ఎంతవరకైనా దిగజారిపోతారు.ఎంతవరకైనా వస్తారు.ఏ పనైనా చేస్తారు. ఏదైనా ఇస్తారు. అవును. మనుషులకు వందసార్లు మనము వారికి ఉపయోగపడి వారి అక్కర తీర్చామనుకొండి అయితే ఏదో ఒక్కసారి వారి అవసరము తీర్చలేదనుకోండి ఇక వందసార్లు చేసిన మేలులను మర్చిపోయి ఈ ఒక్కసారి చేయని మేలులకొరకు మనమీద సణుగుతారు. గొణుగుతారు. ఇంకా అవసరమైతే మనగురించి చాటింపు కూడా వేస్తారు*.
ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు
దేవుని ప్రేమ కంటే లోక ప్రేమ గొప్పది కాదు
యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹
అవును దేవుడు లోకమును (నిన్ను) ఎంతో ప్రేమించాడు... ఎంతగా అంటే నీవు తనతో ఒక గంట, ఒకరోజు, ఒక సంవత్సరం గడపాలి అని కాదు గాని నీవు తనతో యుగయుగాలు జీవించాలి అని కోరుకున్నాడు, ఆశపడ్డాడు, కలలు కన్నాడు. నీవు తనకోసమే జీవించాలని, నీ ప్రేమ మొత్తం తనకే సొంతం కావాలి అని ఆశించాడు. కానీ పాపసహితమైన ఈ లోకములో మన పూర్వికులు (ఆదాము, హవ్వలు)చేసిన పాపము ద్వారా మనం జన్మతహః పాపులము అందుకే పాపులమైన మనల్ని పరిశుద్దులనుగా చేసి తనతో యుగయుగాలు జీవించేలా చేయుటకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈలోకములోనికి పంపించారు. ఈలోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు అంటే నీ నా పాపాలను తుడిచివేయుటకు ముప్పది మూడున్నర సంవత్సరములు ఈ లోకములో జీవించి సిలువపై మన పాపముల నిమిత్తం మరణించాడు. అంతే కాకుండా ఈలోక యాత్రను ముగించినపిమ్మట మనం పరలోకములో యుగయుగాలు తండ్రితో జీవించుటకు మన నిమిత్తం మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మనకోసం స్థలము సిద్దము చేయుటకు పరలోకమునకు ఆరోహణమయ్యాడు, మనల్ని తిరిగి తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోతున్నాడు.
*గమనించండి ఈలోకములో మనుషులను నమ్మి మోసపోయాము అని చెప్పేవారే వున్నారు కానీ, దేవునిని నమ్మి మోసపోయాము అని చెప్పేవారు ఇప్పటివరకు ఈ భూమిమీద లేరు*.
* *ప్రియా సహోదరి,సహోదరులారా మనుషుల ప్రేమ కొంత పరిమితివరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో పరిమితిలేదు. ప్రాణమిచ్చిన ప్రేమ*!
నీ కోసం నా కోసం కలువరి సిలువలో ప్రాణ త్యాగమై తన ప్రాణాలను అర్పించిన యేసు క్రీస్తు ప్రేమ నిజమైన ప్రేమ
ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరి నీవు...?
ఈ ఒక్క మెసేజ్ ఇతరులకి షేర్ చేయండి
దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఇట్లు
Sam
మీ సహోదరుడు
0 Comments