ఏమి విత్తుతున్నావో జాగ్రత్తగా పరీక్షించుకో Must Read Now || Don't Skip ||

ఏమి విత్తుతున్నావో జాగ్రత్తగా పరీక్షించుకో Must Read Now || Don't Skip ||

🌸 *ఏమి విత్తుతున్నావో జాగ్రత్తగా పరీక్షించుకో*🌸


🌲 ఒక రోజు ఒక అబ్బాయి ఒక విత్తనాన్ని భూమిలో నాటుతూ ఉంటాడు ఇంతలో తన స్నేహితుడు వచ్చి ఒరేయ్ ఏమి విత్తనం నాటుతున్నావు అని అడుగుతాడు అందుకు అతను అబ్బా..... నేను నీకు చెప్పను అది చాల చాల రహస్యం అని అంటాడు. అతని స్నేహితుడు ఒరేయ్ పిచ్చోడా ఈరోజు నీవు నాటే విత్తనం ఏమిటో నాకు నువ్వు చెప్పకుండా దాచవచ్చు కానీ రేపు అది పెరిగినప్పుడు ఈ ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా అని అంటాడు. 

🌷 *ఓ యువత ఈ అబ్బాయిలానే నేడు ఎవరికి తెలియకుండా రహస్యముగా నువ్వు నీ రూములో కూర్చుని చూడరాని అస్లీల దృశ్యాలను చూస్తూ, ఎవ్వరికి తెలియదు కదా అని అంటుకుంటూ నీ నేత్రాశను తీర్చుకుంటున్నావా.*

🌷 *ఎవ్వరికి తెలియకుండా పేరు మార్చుకుని నీ బోయ్ ఫ్రెండ్ లేదా గార్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నన్ను ఎవ్వరు చూడటము లేదులే అనుకుంటున్నావా.*

🌷 *అక్రమముగా డబ్బు సంపాదిస్తూ ఇది నా ఆఫీసులో, నా ఇంట్లో ఎవ్వరికి తెలియదు కదా అని అనుకుంటున్నావా.* 

🌷 *చర్చిలో విశ్వాసమనే, క్రైస్తవ్యమనే ముసుగు వేసుకుని బయటకి రాగానే బ్యూటీ పార్లర్లు, మద్యం దుకాణాలలో ఆనందిస్తూ దూమపానం చేస్తూ ఇది మా చర్చిలో ఎవ్వరికి తెలియదులే అనుకుంటున్నావా*. 

🌷 *అమ్మాయిలను రహస్యముగా చూస్తూ వారు నన్ను చూడటంలేదులే అని కంటితోనే వ్యభిచారిస్తూ పైకి మాత్రం బుద్ధిమంతునిలా నటిస్తున్నావా.* 

🌷 *చదువు పేరుతో నీ తల్లిదండ్రులను లక్షలు ఖర్చుపెట్టిస్తూ నచ్చిన సినిమాలకు, షికార్లకు తిరుగు వారికి ఇదంతా తెలియదు కదా అని సంబరపడుతున్నావా.*

🌷 *పైకి సేవకునిగా, సేవకురాలిగా నటిస్తూ ఆత్మతో నింపబడినట్లు ఆరాధనా చేస్తూ గొంతు పగిలిపోయేలా వాక్యం చెప్తూ అటు పిమ్మట ఎవ్వరికి తెలియకుండా అమ్మాయిలేదా అబ్బాయిలతో అడ్డమైన చాటింగులు చేస్తూ మాటలతోనే నీ కాముకత్వాన్ని తీర్చుకుంటున్నావా.* 

🌷 *నీ భార్య లేదా భర్తకి తెలియకుండా స్నేహం పేరుతో జారత్వపు క్రియలు చేస్తూ ఎవ్వరికి తెలియదు కదా అని అనుకున్నావా.*

🌷 *ఎవ్వరు చూడటం లేదు కదా అని లంచము ఇచ్చి/ పుచ్చుకొని లేదా అక్రమమైన మార్గములో నడిచి ఆస్తిపాస్తులు కూడగట్టుకుంటూ ఎవ్వరికి తెలియదు కదా అనుకుంటున్నావా.* 

🌷 *మందిరానికి రాకుండా, ప్రార్ధించుటకు ఆసక్తి చూపకుండా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఏవేవో కుంటిసాకులు చెప్పుకుంటూ జీవిస్తున్నావా.*

🌷 *ప్రార్ధన చెయ్యడానికి, వాక్యము చదవడానికి కూడా సమయములేదు అంటూ గంటలు గంటలు ఫోను పట్టుకుని కూర్చుంటూ ఎవ్వరికి తెలియదు కదా నా గురించి అని భుజాలు ఎగరేస్తున్నావా.* 

🌲 *మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును, ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును - గలతియులకు 6:7,8*

🌹 జాగ్రత్త.... ఈరోజు నీవు చేసేది ఎవ్వరికి తెలియకపోవచ్చు, ఎవ్వరు చూడకపోవచ్చు కానీ నీవు చేసే ప్రతిదానికి బదులుగా రహస్యమందు చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తారు అని జ్ఞాపకము చేసుకో, నువ్వు ఈరోజు ఏమి విత్తుతావో రేపు దానినే కోస్తావు అని గుర్తుంచుకో. 

🌲 *మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును - లూకా 12:3*

🌲 *మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు - మత్తయి 10:26* 

🌹 కాబట్టి ఎవరు చూడటము లేదు కదా, ఎవరికీ తెలియదు కదా అని వక్ర మార్గములో నడుస్తూ కానీ పనులు చెయ్యకుండా, శరీరను బట్టి క్షయమను పంటను విత్తక నిత్యజీవమును పొందుటకు అక్షయమను పంటను కోసేవారివలె నీతిని విత్తుదాము.

Post a Comment

0 Comments

Join In Telegram