ప్రియుడా నిన్నే చేరాలని (Priyuda Ninne Cheralani) Lyrics – Adam Benny
📜 Full Lyrics
ప్రియుడా నిన్నే చేరాలని
ప్రియమార నీతో ఉండాలని
నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది (x2)
Verse 1
లోకము విడచి ఆశలు మరిచి
నిన్నే చేరే వేళ... (x2)
మదిలో నూతన గానం మోగే ఆవేళ.. (x2)
ఎపుడోయని వేచియున్నానయ్య.. (x2)
నా ప్రాణం నీ కోసం ఆశతో చూస్తున్నది.. (x2)
ప్రియుడా నిన్నే చేరాలని...
Verse 2
ఉప్పొంగుచున్న హృదయార్పణ తో
నీ పాదాలే చేరే వేళ (x2)
ప్రభువా నిన్ను చూసి మనసారా నిన్ను తలచి (x2)
పాడాలని స్తుతి చేయాలని (x2)
నా హృదయం నీ కోసం వేచి చూస్తున్నది (x2)
Bridge (యేసు నిన్నే)
దగదగ మెరిసే పరలోకములో
నిన్ను నేను కలిసే వేళ (x2)
వరుడా నిన్ను చేరి ప్రియమారా కొనియాడి (x2)
వేడాలని పాడుకోవాలని (x2)
నా మనస్సు నీ కోసం ఎదురుచూస్తున్నది (x2)
యేసు నిన్నే చేరాలని
ప్రియమారా నీతో ఉండాలని
నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది (x2)
యేసు నిన్నే... (x2)
ℹ️ Credits
Lyricist: Pastor Adam Benny
Singer: Sister Gayatri
Music: JK Christopher
Editing: V. Satish
0 Comments