పట్టు చీర కట్టి అరె జిన్ను ప్యాంటు తొడిగి ఫంక్షన్లకు పోతరు ఉరుకులాడుకుంట పెండ్లీలకు పోతరు ఎంతో సంబరంగా ప్రార్థన అంటే కాళ్లు నొచ్చే ముక్కునొచ్చే మూరు నొచ్చే Song With Lyrics

పట్టు చీర కట్టి అరె జిన్ను ప్యాంటు తొడిగి ఫంక్షన్లకు పోతరు ఉరుకులాడుకుంట పెండ్లీలకు పోతరు ఎంతో సంబరంగా ప్రార్థన అంటే కాళ్లు నొచ్చే ముక్కునొచ్చే మూరు నొచ్చే Song With Lyrics

Praise And Worship God 🙏



పట్టు చీర కట్టి అరె జిన్ను ప్యాంటు తొడిగి 2

ఫంక్షన్లకు పోతరు ఉరుకులాడుకుంట

పెండ్లీలకు పోతరు ఎంతో సంబరంగా ప్రార్థన అంటే కాళ్లు నొచ్చే ముక్కునొచ్చే మూరు నొచ్చే 2

దేవుని బిడ్డలా సర్ప సంతానమా మారుమనస్సులేని పాపిష్టి జనమా 


1. ఆరు రోజులు పనికి మంచిగానే పోతరు ఆదివారము వస్తేనే ముఖమెట్లనో పెడతరు 

ముసలమ్మ ముచ్చట్లకు మీద మీద పడతరు మందిరమంటేనే మాయ రోగమంటారు


2. టీవీ ముందు పిల్ల జెల్లా అందరు కూర్చుంటారు ఎన్ని గంటలైనా విసుగు రానే రాదు అంటరు గంట ప్రార్ధనంటే బోరు వస్తది అంటరు పేరంటమంటే ఉరికురికి పోతరు


3. వాట్సప్ ఫేస్బుక్ గడియ గడియ చూస్తరు వాక్యానికైతే తీరిక లేదంటరు ప్రభు భోజనం వదిలి ప్రభువు మేళ్ళని మరిచి వనభోజనాలకు వడివడిగా పోతరు


4. ఎంత దూరమైన ఎండ ఎట్ల కొట్టిన బంధువుల ఇండ్లకు బండిమీద పోతారు 

లగ్గమైన పురుడైన ముందుగానే పోతారు చల్లపూట ప్రార్థన అంటే కాళ్లు జాపి పంటరు 


5. కొత్త బట్ట కోసము అమీరులై పోతారు సెల్ ఫోన్ కోసం చాల ఖర్చు పెడతరు సూదిమందుల కోసము ఎంతయైనా ఇస్తరు దేవుని భాగం అంటే అప్పులున్న యంటరు


6. వేలెత్తి చూపిన గట్టిగ గద్దించిన ముఖమంతా మాడ్చుకొని కుళ్ళులోన పెంచుకొని

 దిద్దుబాటు లేని భక్తిహీనులవుతారు దిన దినము వెనుకకు వెనక కెళ్ళిపోతరు

Post a Comment

0 Comments

Join In Telegram