పల్లవి:👨🎤👩🎤
{సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా } [1]
{నీకే... వందనం....
నను ప్రేమించిన యేసయ్యా...
నీకే... స్తోత్రము...
నను రక్షించిన యేసయ్యా...} [2]
|సంవత్సరములు|
చరణం:1️⃣
{గడచిన కాలమంతా...
నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా...
కలువరి సిలువలో మోసినావు } [2]
{శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు } [2]
{నీకే... వందనం...
నను ప్రేమించిన యేసయ్యా...
నీకే... స్తోత్రము...
నను రక్షించిన యేసయ్యా...} [2]
|సంవత్సరములు|
చరణం:2️⃣
{బ్రతుకు దినములన్నీ...
ఏలీయావలే నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి...
నూతన వస్త్రములు దరియింపజేసావు } [2]
{నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు } [2]
{నీకే... వందనం...
నను ప్రేమించిన యేసయ్యా...
నీకే...స్తోత్రము...
నను రక్షించిన యేసయ్యా...} [2]
|సంవత్సరములు|
🎤 🎧
0 Comments