శ్రీయేసు పుట్టాడని ఈలోకానికి వచ్చాడని తంబురతోను సితారాతోను ఉత్సాహగానము చేసెదము TELUGU CHRISTMAS SONG LYRICS
శ్రీయేసు పుట్టాడని ఈలోకానికి వచ్చాడని తంబురతోను సితారాతోను ఉత్సాహగానము చేసెదము TELUGU CHRISTMAS SONG LYRICS
November 17, 2021
Praise And Worship God 🙏
పల్లవి:-
శ్రీయేసు పుట్టాడని
ఈలోకానికి వచ్చాడని
తంబురతోను సితారాతోను
ఉత్సాహగానము చేసెదము (2)
ప్రభుయేసుని స్తుతించెదము
రారాజును ప్రకటింతుము
ప్రభుయేసుని స్తుతించెదము
రారాజును పూజింతుము
(శ్రీయేసు పుట్టాడని)
చరణం:-+01
అల్పమైన స్వల్పమైన
బెత్లహేములో
రారాజు రక్షకుడై
ఉదయించినాడు..(2)
పాపాన్ని క్షమియించే
శాపాన్ని తొలగించే
పరిశుద్ధుడు యేసు
పరమునుండి వచ్చినాడు (2)
పరిశుద్ధుడు యేసు
పరమునుండి వచ్చినాడు
(ప్రభుయేసుని)
చరణం:-+02
మనసున్న మహరాజు
మహిమను విడచి
మనిషిని మహిమలో
చేర్చగ వచ్చినాడు (2)
మరణాన్ని దాటించే
జీవంలో నడిపించే
మరణము లేని
మెస్సయ్య వచ్చినాడు (2)
మరణము లేని
మెస్సయ్య వచ్చినాడు
(ప్రభుయేసుని)
0 Comments