తెలిసిన సత్యం తెలుపకపోతే మహాపాపం SHARE TRUTH GOSPEL TO EVERYONE

తెలిసిన సత్యం తెలుపకపోతే మహాపాపం SHARE TRUTH GOSPEL TO EVERYONE

Praise And Worship God 🙏

తెలిసిన సత్యం తెలుపకపోతే మహాపాపం

ఒకరోజు మన తెలుగు సేవకుడు వాక్యము చెప్పడానికి అమెరికా దేశము వెళ్ళాడట, అక్కడ ఒక స్టేట్ లో వాక్యము చెప్పి ఇంకొక స్టేట్ లో చెప్పడానికి విమానములో ప్రయాణము చేస్తునప్పుడు సడన్ గా ఆ విమానం నడిపించే పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేసాడు విమానములో టెక్నికల్గా ఒక సమస్య వచ్చింది. వెంటనే ల్యాండ్ కావాలి. మీ బెల్ట్స్ పెట్టుకోండి భయపడవద్దు అని దాని సారాంశం. ఎప్పుడైతే పైలట్ ఆ విధముగా చెప్పాడో ఇతడు ఆలోచించడం మొదలు పెట్టాడట వచ్చి వచ్చి ఈ ప్రమాదములో పడ్డానేమిటి..! ఇంతకి నాకు పరలోకం దగ్గరగా ఉందా? భూమి దగ్గరగా ఉందా? అని అనుకొని ప్రభువా..! ఇదే కనుక నా చివరి రోజైతే నన్ను నీ రాజ్యానికి చేర్చుకుని, విడిచి వచ్చిన కుటుంబాన్ని తన సంఘాన్ని మందిరమును కనికరించండి అని ప్రార్ధన చేస్తూ ఉండగా అప్పుడే ఆ విమాన సిబ్బంది. వచ్చి ఒక శుభవార్త చెప్పారు- మనము క్షేమముగా ల్యాండ్ అయ్యాము. ఇది రిపేర్ కావడానికి కొంచెం టైం పడుతుంది కావున మీరు వెళ్లి విమానాశ్రయములో వెయిట్ చెయ్యండి. మరలా పిలుస్తాము అని చెప్పి గేటు పాస్ ఇచ్చి పంపించారు. వెళ్లి విమానశ్రయములో కూర్చున్నాడు. రెండు గంటలు అయిన ఇంకా పిలుపు రాలేదు. కానీ ఆకలి పిలుపు మాత్రం వచ్చింది - లంచ్ ఎప్పుడు అని? సరే ఏమన్నా తిందాం! అని అక్కడున్న ఫుడ్ స్టాల్ లో మొత్తం చూసాడు రెండు లేదా మూడు మాంసం ముక్కలు, ఒక కూల్ డ్రింక్- వీటి రేటు పది డాలర్స్ లేదా పదిహేను డాలర్స్ ఇలా ఉన్నాయి. రెండు లేదా మూడు మాంసం ముక్కలకు 500 రూపాయలు ఎందుకు? మా ఇండియాలో అయితే 5 కోళ్ళు వస్తాయి అని అనుకొని అక్కడున్న రెస్టారెంట్స్ అన్నీ తిరిగాడు గానీ రేట్స్ చూసాక కొనబుద్ధి కావడం లేదు. కానీ రేట్స్ సంగతి పొట్టకు తెలియదు కదా...! ఇది మాత్రం గొడవ చేస్తూనే ఉంది. ఇక లాభం లేదు అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గరకు వెళ్లి చేతిలో డబ్బులు పట్టుకుని లైన్లో నించొని ఒక పదిహేను డాలర్లు ఇచ్చి మూడు మాసం ముక్కలు కొనుక్కున్నాను. త్వరగా తినేస్తే మరలా కావాలనిపిస్తాది, కదా..! నమ్మండీ.. వాటిని ముందు పెట్టుకుని కనీసం ఒక గంట సేపైనా తిని ఉన్నాడు. కానీ, ఆకలి తీరలేదు దగ్గరలో వాటర్ టాప్ ఉంటే వెళ్లి వాటర్ తాగి వచ్చి కూర్చున్నాడట. తన చుట్టు ఉన్నవాళ్ళు మాత్రం ప్లేట్స్ మీద ప్లేట్స్ పడి పడి తింటున్నారు. తనకేమో అకలి తీరక కడుపులో మంట. ఈ లోపల అనౌన్స్మెంట్ వచ్చింది- 'ఫ్లైట్ రెడ్ అయింది. వచ్చి ఎక్కమని అందరూ లోపలికి వెళ్తూ. ఉంటే ఇతను చివర నించున్నాడు, నెమ్మదిగా లోపలికి వెళ్తూ వెళ్తూ తన చేతిలో ఉన్న గేటు పాస్ చూడగా ఆ గేటు పాస్ క్రింద ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి, దీని క్రింద ఎదో రాసి ఉంది అని పరిశీలించి చూస్తే- 'అత్యవసర పరిస్థితులలో మీరు ఈ విమానశ్రయములో ల్యాండ్ అయ్యారు కావున మీరు ఎంత సేపు ఇక్కడ గడుపుతారో అంత సేపు మీరు ఏమి తిన్నా సరే అది ఫ్రీ గానే తినవచ్చు' అని రాసి ఉంది. అంతా ఫ్రీ అంట ! ఏమైనా తినవచ్చంట! ఈ విషయం తనకు ఎప్పుడు తెలిసింది? అన్నీ అయిపోయాక ఫ్లైట్ ఎక్కేముందు తెలిసింది. అయ్యో..! ఇది తెలియక ఎంతగా ఆకలితో మాడిపోయా అని నిట్టూర్చాను.. ఆ గేటు పాస్ని చూసుకుంటూ అలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ తన ముందు నించున్న వాళ్ళు అక్కడ నేను రెస్టారెంట్ దగ్గరకు వెళ్లి ఒక చేతిలో డబ్బులు పట్టుకుని, ఇంకొక చేతిలో గేటు పాస్ పట్టుకుని.. కొన్న వాటికి నేను డబ్బులు చెల్లిస్తున్నప్పుడు నా పక్కనే ఉన్నారు కదా. వీరికి అప్పటికే తెలుసు కదా! మరినాకు ఎందుకు చెప్పలేదు? నేను ఒక్కపైసా కూడా చెల్లించనవసరం లేదని పోనీ, ఆ కౌంటర్లో డబ్బులు తీసుకున్నవాడు కూడా నా ఎడమ చేతిలో ఉన్న పాస్ చూసాడు కదా, తనైనా ఎందుకు చెప్పలేదు! మీరు ఇక్కడ ఎంతైనా ఫ్రీగా తినవచ్చని? ఇదంతా వీళ్ళకు ముందే తెలిసినప్పటికి నాకు చెప్పలేదు. ఎంత ఘోరం..! అని మీ మనస్సులో అన్పిస్తుంది కదూ? అయితే అంతకన్నా ఘోరం ఇంకొకటి మనము. గ్రహించవలసి ఉన్నది ప్రతి మనిషి తాను చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్తున్నాడు, దేవునికి వ్యతిరేకముగా జీవించిన విధానాన్ని బట్టి యుగయుగములు భయంకరమైన నరకములో కాలిపోవలసిన దుస్థితిని కొని తెచ్చుకుంటున్నాడు. కాని వాస్తవముగా అయితే తాను నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉందా? ఈ లోక పాపములో కొట్టుకొనిపోయి ఆ భయంకర నరకాగ్నిలో కాలిపోవలసిన అవసరం ఉందా? లేదు, ఎందుకంటే ఈ పాపిష్టి మనిషి కోసం యేసుక్రీస్తు. ముందుగానే వెలచెల్లించాడు. మరి ఈ సత్యము, రక్షించబడిన నీకు నాకు బాగా తెలుసు. ఈ లోకములో మనిషిగా పుట్టిన వాడెవడు కూడా నరకానికి వెళ్ళవలసిన అవసరం లేనే లేదు. దేవుడు ప్రతి ఒక్కరినీ సమానముగా ప్రేమించి ప్రతి ఒక్కరికొరకు సిలువ మీద మరణించి మనిషికి రావలసిన శిక్ష అంతటినీ కూడా కొట్టివేసాడు యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని విని విశ్వసిస్తే చాలు రక్షించబడతాడు. ఇది దేవుడు ఉచితముగా అనుగ్రహించే రక్షణ. ఈ సత్యము తెలిసిన నీవు లోకానికి, తెలియని వారికి నోరు విప్పి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందా? లేదా? మూడు మాంసం ముక్కలు ఫ్రీగా తినే అవకాశము ఉన్నప్పటికీ తెలియక డబ్బులు చెల్లిస్తే అది తెలిసిన వారు చెప్పకపోతే.. అయ్యో ఎంత ఘోరం అని అన్పించింది. అలా అయితే నీ ఇంట్లో, నీ ఇంటి పక్కన. నీ ఆఫీసులో నీ స్కూల్ లేదా కాలేజిలో.. నీ ఇంటివారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ క్లాస్మేట్స్ నరకానికి వెళ్తుంటే వారిని ఆపి...అయ్యా...! నీవు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ పాపమంతటినీ ఆ యేసయ్య భరించాడు. నీ మీదకు రావలసిన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఆయనను విశ్వసించు చాలు.. నీకు ఉచితముగా పరలోక భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని సత్యము తెలిసిన నీవు చెప్పకపోవడం ఇంకెంత ఘోరమో ఒక్కసారి ఆలోచించమని మనవి.

ఈ రోజునుండైనా ఆ సిలువను గూర్చిన వార్తను పునః రుత్థాన సందేశాన్ని లోకానికి పంచి పెడదామా ! నశించి పోతున్న వారికి రక్షకుణ్ణి పరిచయం చేద్దామా! రక్షణ- దేవుని యొక్క వరం ఇది పూర్తిగా ఉచితం. (ఎఫెసీ 2:8) సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. (మార్కు 16:15) అయ్యో సువార్త ప్రకటించకపోయినయెడల నాకు శ్రమ పౌలు (1కొరింథీ 9:16) తెలిసిన సత్యం తెలుపకపోతే మనకు శ్రమ. వినకపోతే వారికి శ్రమ.

Post a Comment

0 Comments

Join In Telegram