మీ హృదయ ఆలోచనలు ఏలా ఉన్నాయి? || don't SKIP || Must Read ||

మీ హృదయ ఆలోచనలు ఏలా ఉన్నాయి? || don't SKIP || Must Read ||

Praise And Worship God 🙏

మీ హృదయ ఆలోచనలు
 ఏలా ఉన్నాయి?
మన హృదయం మనల్ని 
తప్పుదోవ పట్టించవచ్చు? 
చాలా జాగ్రత్త
హృదయము 
అన్నిటికంటె మోసకరమైనది
అది ఘోరమైన వ్యాధికలది
"దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు 
అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు 
హృదయములో నుండియే వచ్చును"
అని యేసు క్రీస్తు ప్రభువు చెప్పారు
దేవుడి చిత్తం చేయకుండా 
దేవుడి ఇష్టానికి విరుద్ధమైన పనులను 
మన హృదయం సమర్ధిస్తుంది కూడా కొన్నిసార్లు.
దావీదు కుమారుడైన అబ్షాలోము 
హృదయ ఆలోచనలు ఎప్పుడూ చెడ్డగా ఉండడం వలన చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ఎస్తేరు కాలంలోని హామాను యొక్క 
హృదయ ఆలోచనలు ఎప్పుడూ చెడ్డగా ఉండడం వలన ప్రాణాలు కోల్పోయాడు.
మనము కొన్నిసార్లు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నామని బాధపడే సందర్భాలు చాలానే ఉంటాయి. ఆలోచించండి.
హృదయంలో పుట్టే ఆలోచనలు
 మంచివా? చెడ్డవా? 
మనం ఏలా పసిగట్టగలము.
ప్రతీరోజూ బైబిలు చదవడం, 
వ్యాక్యాన్ని ధ్యానించడం, 
ప్రార్ధన చేయడం,
దేవుడిని స్తుతించడం వల్ల 
మన హృదయంలో ఉన్న 
ఆలోచనలు బయటపడతాయి.
రెండు అంచుల ఖడ్గం వంటి 
దేవుని వాక్యం వెలుగులో 
హృదయపు యొక్క 
తలంపులను (ఆలోచనలను) 
ఏలా ఉన్నాయో ప్రతీరోజు పరిశీలించుకోవచ్చు.
" ......హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది." హెబ్రీయులకు 4:12
బైబిల్ చెబుతున్న వాటిని స్వీకరించి, 
అందులో ఉన్న ప్రకారం 
మనం జీవించినట్లయితే 
మన మనస్సాక్షి అనేక హెచ్చరికలు ఇస్తుంది. 
తద్వారా చెడ్డ ఆలోచలకు తావివ్వం.
మీ హృదయంలో పుట్టే ఆలోచనలు తెలుసుకోవడానికి సహాయం చేయమని 
పరిశుద్ధాత్మను అడగండి
ఎందుకంటే హృదయాలను 
పరిశోధించేది దేవుడే
మన హృదయములకంటే 
అధికుడై, సమస్తమును దేవుడు ఎరిగియన్నాడు
మనుష్యులను మోసం చేయవచ్చు. 
దేవుడిని మోసం ఎవరూ చేయలేరు.
మన హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నట్లయితే 
వెంటనే మన హృదయాన్ని 
దేవుని వాక్య వెలుగులో మార్చుకోవాలి.
మన హృదయ ఆలోచనలు 
మంచిగా ఉన్నట్లయితే 
ఇంకా ఎక్కువగా మన హృదయాన్ని 
దేవుని వాక్య వెలుగులో నడిపించుకోవాలి
మన హృదయ ఆలోచనలు ఎప్పుడూ పాపం చేయమని, లోకంలో సుఖాలు అనుభవించమని, ఎక్కువ వస్తువులు, ఎక్కువ డబ్బు, మొదలైనవి సంపాదించమని చెబుతుంది.
కాని మన హృదయాన్ని ఎప్పుడూ అయితే దేవుని వైపు త్రిప్పుతామో పరలోక రాజ్యంవైపు 
మన హృదయ ఆలోచనలు వెళతాయి
వినోదం, టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే మనం చిటికెస్తే చాలు కావాల్సినవి అన్ని మన కాళ్ల దగ్గరకు వస్తాయి.
కాబట్టి సెల్ ఫోన్ కూడా ఒక రకంగా మన ఆలోచనలు చెడగొట్టవచ్చు. 
కాబట్టి సెల్ ఫోను ఎంత వాడాలో అంతే వాడితే మంచిది
సెల్ ఫోన్లో మన హృదయాన్ని పాడుచేసేవి కూడా ఉన్నాయి. జాగ్రత్త.
మీ హృదయ ఆలోచనలు 
ఏలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి.. 
లేకపోతే నరకం కూడా తప్పకపోవచ్చు.
"హృదయము అన్నిటికంటెమోసకరమైనది, 
అది ఘోర మైన వ్యాధికలది, 
దాని గ్రహింపగలవాడెవడు?" యిర్మీయా 17:9
"దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును"
 మత్తయి 15:19
"నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
 1 దినవృత్తాంతములు 29:17
"ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. "
1 యోహాను 3:19
"దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము." కీర్తనల గ్రంథము 51:10
"హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? " కీర్తనల గ్రంథము 44:21
"ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది." హెబ్రీయులకు 4:12
"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" సామెతలు 4:23


Post a Comment

0 Comments

Join In Telegram