నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము For Youth Brothers Sisters and Parents

నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము For Youth Brothers Sisters and Parents

Click here For More Messages


✳ *నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము*. 
                       ప్రసంగి 5:1
అంటే దీని అర్ధం? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రమే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. మిగిలిన సమయంలో నీకు నచ్చినట్లు జీవించు అని మాత్రం కాదు.
 *దేవుని మందిరానికి వెళ్లే నీవు, వెళ్ళినప్పుడు మాత్రమే కాదుగాని. అన్ని సందర్భాలలోనూ నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోవాలి*. 
👉 *ఎందుకంటే?* 
*దేవుని మందిరానికి వెళ్లేవారిపట్ల, క్రీస్తుని అంగీకరించని వారు సహితం ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి వుంటారు. క్రైస్తవుల యొక్క ప్రవర్తన ఈ రీతిగా ఉంటుందని.*
👉 అట్లాంటి ప్రవర్తననే మననుండి వారు ఆశిస్తారు. 
*అట్లాకాకుండా దానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన వుంటే, వారు మనలను ప్రశ్నిస్తారు. తద్వారా మన దేవుని ఘనమైన నామమునకు అవమానం.*  
👉అంతేకదా? వారమంతా నచ్చినట్లు జీవించి, ఆదివారం మాత్రం దేవుని మందిరానికి వెళ్తుంటే, ఆయనను ఎట్లా ఆరాధించగలం?  
కనీసం, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడైనా మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? 
*నీ యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము*
             1 తిమోతికి 4:12
♻ *డియర్ బ్రదర్* ————
🔸షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించొద్దు. 
🔸షేడ్ మరియు చిరిగిపోయిన, పీలికలవంటి జీన్స్ వద్దు
🔸కాలర్ లేని టి షర్ట్స్ వద్దు.
🔸విచిత్రమైన హెయిర్ కటింగ్ & మల్టీ కలరింగ్ వద్దు.
🔸అమ్మాయిలవలె జుట్టుపెంచుకోవద్దు.
🔸బైబిల్ లేకుండా వద్దు.
🔸మొబైల్ జోలికి పోవద్దు. 
🔸 చూపులు అమ్మాయిలవైపు వద్దు. 
🔸చూయింగ్ గమ్స్ నమలొద్దు.
🔸పాటలు అయిన వెంటనే బయటకిపోవొద్దు. 
🔸నీవు డిస్టర్బ్ కావొద్దు. ప్రక్కవారిని డిస్టర్బ్ చెయ్యొద్దు. 
♻ *డియర్ సిస్టర్* ———
🔹షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించొద్దు 
🔹జీన్స్ & టి షర్ట్స్ వద్దు
🔹మేకప్ వద్దు
🔹జుట్టు విరగబోసుకోవద్దు. అట్లా అని విస్తారమైన జడలొద్దు. 
🔹మొబైల్ వద్దు.
🔹బైబిల్ ఒక్కటే ముద్దు. 
🔹అబ్బాయిలవైపు చూడొద్దు. 
🔹వారిని ఆకర్షించే ప్రయత్నం ఏది వద్దు. 
🔹నీ ప్రత్యేకతను చాటడానికి ప్రయాసపడొద్దు. ( దేవుని విషయంలో తప్ప) 
🔹స్పెషల్ సాంగ్ ఇవ్వలేదని, చర్చికెళ్ళడం మానెయ్యొద్దు. 
🔹నీవు డిస్టర్బ్ కావొద్దు. ప్రక్కవారిని డిస్టర్బ్ చెయ్యొద్దు. 

♻ *డియర్ పేరెంట్స్* ————
▪షూస్ , లేదా చెప్పులతో మందిరంలో ప్రవేశించద్దు. 
▪చిన్ని బిడ్డలను తప్పక సండే స్కూల్ కి పంపించండి. 
▪మీ చిన్ని బిడ్డలను తప్పక మందిరానికి తీసుకెళ్ళాలి. వారు అల్లరి చేస్తుంటే, వారిని నియంత్రించే బాధ్యత పూర్తిగా మీరే తీసుకోవాలి.
▪ఏదో ఫ్యాషన్ షో కి వెళ్తున్నామన్నట్లుగా రెడి కానవసరం లేదు. మీ డ్రెస్సింగ్ చూచినవారికెవరికైనా దేవుని పిల్లలు ఇట్లా వుంటారన్నమాట అనిపించేలా ఉండాలి. అంతేగాని ఆమ్మో! వీళ్లా!! అనేటట్లుగా కాదు. 
▪మేకప్ లకు కాదుగాని, హృదయాన్ని అలంకరించుకొని, ఆత్మతో, సత్యముతో ప్రభువును ఆరాధించుటకు సిద్దపడండి. 
▪ముసుగు తప్పక ధరించాలి. 
▪మొబైల్ ఫోన్ లను తప్పక స్విచ్ ఆఫ్ చెయ్యండి. బైబిల్ లేకుండా వెళ్లొద్దు. 
▪మందిరానికి వెళ్లేముందు *ప్రభువా ఈ దినాన్ని నీవు నాతో మాట్లాడండి*. అని ప్రార్ధించి, కృతజ్ఞతతో, చెప్పలేనంత ఆనందంతో వెళ్ళండి. 
▪సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ప్రాముఖ్యమైన విషయాలను నోట్ చేసుకొనండి. 
▪ఆదివారపు ఆరాధనకు ముందుగా మీరే వెళ్ళాలి. ఆశీర్వాద ప్రార్ధన అయ్యేవరకు బయటకు రావొద్దు. 
▪ఆరాధన అనంతరం, చిరునవ్వుతో, హృదయపూర్వకంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని, సమాధానంతో గృహాలను చేరండి. 
*దేవుని కృప మీకు తోడైయుండి నడిపించును గాక! ఆమెన్!*




Post a Comment

0 Comments

Join In Telegram