👫వివాహము ఘనమైనదిగా ఉండాలంటే ఏమి చేయాలి ? || Don't Skip || 2 Minutes Message ||

👫వివాహము ఘనమైనదిగా ఉండాలంటే ఏమి చేయాలి ? || Don't Skip || 2 Minutes Message ||

👫వివాహము ఘనమైనదిగా
ఉండాలంటే ఏమి చేయాలి ?

భార్య భర్తలు ఎలా ఉండాలని
దేవుడు చెప్పాడో అలా ఉంటే
ఖచ్చితంగా వారి కాపురం 
బాగుంటుంది !!
 దేవుడు చెప్పినట్లుగా వారు
నడుచుకొంటే!!!
   "రచ్చ బండ"
   "బ్రతుకు జట్కాబండి"
   "సంసారం ఒక చదరంగం"
అని TV లలో ఆశ్రయించి బ్రతుకు
రచ్చ రచ్చ చేసుకోవలసిన పనిలేదు.
      ప్రపంచంలో చాలామంది తమ
పిల్లల కాపురములు బాగోలేదు
అని రకరకాల కౌన్సిలింగ్స్ ని
ఆశ్రయిస్తున్నారు.ఎన్ని కౌన్సిలింగు
లు ఇచ్చినా అవి సున్నానే!
ఎందుకంటే అది లోకజ్ఞానం
దేవుడు ఇచ్చిన కౌన్సిలంగ్ 
తీసుకుంటే వారి జీవితాలు సుఖవంతమవుతాయి.
నూతనంగా వివాహం చేసుకన్న
వారికి,వివాహం అయిన వారికిని
ఈ దేవుని మాటలు ఎంతో సహకరించగలవని నమ్మకంతో
ఈ వర్తమానం!!!
"భర్త యెుక్క విధులు"
1.తన సొంత శరీరమువలె తన భార్యను ప్రేమించాలి.ఎఫెసి 5:28
2.జ్ఞానంతో కాపురం చేయాలి.
     1పేతురు 3:7
3.జీవమను కృపావరంలోపాలివార
ని యెరిగి 1 పేతురు3:7
4.ఎక్కువ బలహీన ఘటమని సన్మానించాలి1 పేతురు 3:7
5.ప్రార్దనలకు ఆటంకం కలుగకుం
డు నట్లు చూసుకోవాలి
1 పేతురు 3:7
6.భార్యకు శిరస్సుగా ఉండాలి
పోషించి,సంరక్షించాలి ఎఫేసి 5:22-23;29,30
7.భార్యను విడనాడకూడదు
సమాధానపడి కలసి,మెలసి
జీవించాలి.1 కొరింథి7;33
మలాకి 2:16,1 కొరింథి 7:11
8.వేరొక స్త్రీని ఆశించకూడదు.
    1 కొరింథి 7:11
9.భర్త తన భాద్యతను మరచి
భార్యకు పెత్తనం ఇవ్వకూడదు
 1 రాజులు 21:25
"భార్య విధులు"
1.తన సొంత శరీరమువలె భర్తను
ప్రేమించాలి.ఎఫెసి 5:28
2.జ్ఞానంతో కాపురం చేయాలి
           1 పేతురు 3:7
3.జీవమను కృపావరంలో పాలివా
రు అని యెరిగి. 1 పేతు3:7
4.భర్త యెడల భయము కలిగి
ఉండాలి.ఎఫేసి 5:33
5.భర్త మానసిక స్థితిని అర్ధం
 చేసుకోవాలి.1 పేతురు3:7
6.భర్తకు లోబడి యుండాలి.
         1 కొరింథి 11:2,3
7.భర్తను విడనాడకూడదు.
         1 కొరింథి 7:33
8.వేరొక పురుషుని ఆశింపకూడదు.1 కొరింథి 7:11
9.భర్త చెప్పిన మాట విని గృహ పరిపాలన చేయాలి. తీతు 2:3-5
        ఆమేన్
 దేవుడు మిమ్మును దీవించును గాక

Post a Comment

0 Comments

Join In Telegram