పల్లవి : ఎందుకో ఈ ప్రేమ నన్ను ఇoతగా ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను ||2||
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగా చేసి ఎన్నుకొంటివి ||2||
ఎనలేని కృప నిచ్చితివి ||ఎందుకో||
చరణం : నీ సన్నిధి పలుమార్లు నే విడినానే
అయిన నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కడతేర్చినావే ॥2॥
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును ॥2॥ ||ఎందుకో||
చరణం : మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోదనలో తోడైనావు
ఏ కీడు రాకుండా మము కాచినావు ॥2॥
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము ॥2॥ ||ఎందుకో||
This song is available in you-tube:
https://youtu.be/F0bE1bR_YfY
from New telugu christian lyrics https://ift.tt/2Ph583f
0 Comments