🎵. *ఎడబాయని దేవుడు*
ఉన్నాడు దేవుడూ నాకు తోడూ
విడనాడడెన్నడూ ఎడబాయడూ(2)
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన
*ఉన్నాడు దేవుడూ నాకు తోడూ*
*విడనాడడెన్నడూ ఎడబాయడూ(2)*
1️⃣
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటిలోయలో మునిగితేలినా(2)
కరుణలేని లోకమూ కాదన్ననూ(2)
కన్నీరు తుడుచును నను కొన్నవాడు
*ఉన్నాడు దేవుడూ నాకు తోడూ*
*విడనాడడెన్నడూ ఎడబాయడూ(2)*
2️⃣
యోహోవ సన్నిధిలో నివసింతునూ
చిరకాలమాయనతో సంతసింతునూ
కృపా మధుర క్షేమములే
నా వెంటే వుండునూ(2)
బ్రతుకు కాలమంతయూ
హర్షింతునూ
*ఉన్నాడు దేవుడూ నాకు తోడూ*
*విడనాడడెన్నడూ ఎడబాయడూ(2)*
*కష్టాలలోన నష్టాలలోనా*
*వేదనలోన శోధనలోనా*
*ఉన్నాడు దేవుడూ నాకు తోడూ*
*విడనాడడెన్నడూ ఎడబాయడూ*
హల్లెలూయా..హల్లెలూయా..
హల్లెలూయా..హల్లెలూయా..
పాడినవారు: *సహో.యస్.పి.బాలసుభ్రమణ్యంగారు*
సేకరణ: *శ్రీమతి జె.విమలకుమారి*
0 Comments