నీకోసం ప్రార్థిస్తున్న యేసుక్రీస్తు మందలో నీవు ఉన్నావా?
▪▫▪▫▪▫▪▫Click here For More Messages
🔺 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే - రోమీయులకు 8:34
🔺 ఈయన తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు - హెబ్రీయులకు 7:25
🔹 తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని యేసుక్రీస్తు నిరంతరము విజ్ఞాపన చేయుచున్నారు,
🔹 ఎవరికోసం ::-
🔸 లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను - యోహాను 17:9
🔹 ఎందుకోసం ప్రార్థిస్తున్నారు ::-
🔸 నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను - యోహాను 17:15
🔸 నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని - లూకా 22:32
🔹 శ్రమలు అంటకాలు రాకుండా మనం వెంటనే పరలోకం చేరిపోవాలి అని కాదు, శ్రమలలో బాధలలో, శోధనలో మన నమ్మిక తప్పి పోకుండునట్లు, దుష్టుని చేతిలో మనం ఓడిపోకుండా ఉండేలా చేయమని యేసుక్రీస్తు వారు నిరంతరం మనకోసం ప్రార్థిస్తుంటే మనం ఇంకా సులువుగా చిక్కులు పెట్టె ప్రతి పాపములో పడిపోతున్నాము ఓడిపోతున్నాము, దేవునికి దూరం అవుతున్నాము అంటే ఒకసారి ఆలోచిద్దాము మనం తన మందలోని గొర్రెలమేనా (తన బిడ్డలేమేనా) లేక వేరొకమందలోని మేక చర్మము కప్పుకున్న తోడేళ్ళ వంటి వారమా, విశ్వాసులమా లేక విశ్వాసులము అని పేరుపెట్టుకున్న భక్తిహీనులమా...
🔹 మనకి ఎదురవుతున్న ప్రతి శోధన నుండి, ఆటంకాలనుండి తప్పించి, సులువుగా చిక్కులు పెట్టె ప్రతి పాపము నుండి విడిపించి రక్షించుటకు మన దేవుడు శక్తిమంతుడు కాబట్టి ఇక నుండి అయినా అవిశ్వాసులముగా ప్రవర్తించక మనకంటే ముందుగా శ్రమలు అనుభవించిన, విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తుని చూస్తూ మన ప్రతి భారమును ఆయనపై వేసి విశ్వాసముతో ముందుకు సాగుదాము..🙏
THANK YOU FOR VISITING THIS BLOG
***************************************
* Follow the Page *
* *********
In This Blogger I Will Post
#Christain Song Lyrics
#Christain Ringtones (Mobile Ringtones)
#Songs Book PDF
So On.....!
For Above All Check In Menu Bar
*****************************************
0 Comments